Mahesh Babu foundation Saved Mokshith Sai Life on Krishna's Demise Day: ఒక వ్యక్తి అవసరంలో ఉన్నప్పుడు సహాయం చేయడం వేరు తాను కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా వెనకాడకుండా సహాయం చేయడం వేరు. అది మాములు మనుషులకు అయితే సాధ్యం కాదు.  ఇప్పుడు మహేష్ బాబు విషయంలో అదే జరిగింది. ఒక పక్కన తన తండ్రి చావు బతుకుల్లో హాస్పిటల్లో ఉన్నా సరే మరో ప్రాణాన్ని బతికించేందుకు మహేష్ తన మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ప్రయత్నం చేయడం హాట్ టాపిక్ గా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సూపర్ స్టార్ కృష్ణ ఈనెల 14వ తేదీ అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చేరారు, 15వ తేదీ తెల్లవారుజామున నాలుగు గంటలకు తొమ్మిది నిమిషాలకు ఆయన తుది శ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో మహేష్ బాబు ఆయన కుటుంబ సభ్యులందరూ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. యావత్ తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకరకంగా తీవ్ర దుఃఖ పరిస్థితుల్లోకి వెళ్లిపోయారు. అయినా సరే మహేష్ బాబు స్థాపించిన మహేష్ బాబు ఫౌండేషన్ మాత్రం తన తాను చేసుకుంటూ వెళ్ళిపోయింది.


ఆంధ్రప్రదేశ్లోని అమలాపురానికి చెందిన మోక్షిత్ సాయి అనే మూడేళ్ల బాబుకు గుండెల్లో రంద్రం ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు.  దీంతో తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురై అసలు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడిపోయారు. వారికి ఆ గుండెలోని రంధ్రాన్ని పూరించే అంత స్తోమత లేదు సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న మహేష్ బాబు ఫౌండేషన్ టీం సభ్యులు వారిని కాంటాక్ట్ అయ్యారు. ఆంధ్ర హాస్పిటల్ కి వెళ్లి బాబుని చూపించమని వారి నుంచి సందేశం అందింది.


ఆ తల్లిదండ్రులు పిల్లవాడిని తీసుకుని హాస్పిటల్ కి వెళ్లి చేరారు. దీంతో అతనికి సర్జరీ అవసరం అని భావించి సర్జరీ చేశారు కూడా. సరిగ్గా గంటల వ్యవధిలో కృష్ణ కన్నుమూయడం అదేరోజు మోక్షిత్ సాయి సర్జరీ చేసుకుని మళ్లీ బతికి రావడం ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. సాధారణంగా అవసరంలో సాయం చేసిన వారిని దేవుడు అంటారు తాను విషాదంలో ఉండి కూడా సాయం చేసిన వారిని ఏమనాలి అంటూ పెద్ద ఎత్తున మహేష్ బాబు అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఇలా వేల మంది చిన్నారులకు ఆపరేషన్లు చేయిస్తూ వారి తల్లిదండ్రులకు గుండె కోత లేకుండా కాపాడుతున్న మహేష్ కు ఎందుకు ఈ గుండె కోత అని వారు బాధ పడుతున్నారు.


ఒకే ఏడాది తల్లిని, తండ్రిని సోదరుడిని కోల్పోయిన ఆయన ఎందుకింత నరకం అనుభవించాలి అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. ఇక వారు సంధిస్తున్న ప్రశ్నలకు ఎవరి దగ్గర సమాధానం లేదు. కానీ ఒక హీరో అయినా దేవుని లాగా ఇంతమంది పిల్లలకు ఆపరేషన్లు చేయిస్తున్న మహేష్ గురించి ఏమని చెప్పగలం ఎంతని చెప్పగలం. హాట్సాఫ్ మహేష్ హాట్సాఫ్! మీరు కోల్పోయిన బంధాలు తిరిగి తీసుకురాలేము, దాన్ని తట్టుకునే గుండె బలం మీకు ఇవ్వాలని ఆ దేవుని కోరుకోవడం తప్ప మేమేం చేయగలం.
Also Read: Ram Charan RC 15 Workout Video : వెకేషన్లో కూడా రెస్ట్ లేకుండా అదే పని.. రామ్ చరణ్‌ వీడియో వైరల్


Also Read: Sudigali Sudheer : జబర్దస్త్ షోను అందుకే వదిలేశా.. ఆఫీస్ బాయ్‌గా అయినా చేస్తా.. సుడిగాలి సుధీర్