Mahesh Babu New Look: ఏమున్నాడ్రా బాబు.. మహేష్ కొత్త లుక్ తో ఫిదా అవుతున్న లేడీ ఫాన్స్!
Mahesh Babu New Look Styled by Aalim Hakim Creating Buzz: మహేష్ బాబు న్యూ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నమ్రత షేర్ చేసిన లుక్ మీద కామెంట్ల వర్షం కురుస్తోంది.
Mahesh Babu New Look Styled by Aalim Hakim Creating Buzz: టాలీవుడ్ లో మహేష్ బాబు అందం గురించి ప్రత్యేకంగా అందరూ ప్రస్తావిస్తూ ఉంటారు. ఇప్పటికీ ఆయనకు పెళ్లి ఇద్దరు పిల్లలు ఉన్నా ఆయనే తమ కలల రాకుమారుడు అని భావించే ఎంతోమంది ఆడపిల్లలు ఉన్నారు. అమ్మాయిలు సైతం ఇలా ఉన్నాడు ఏంట్రా బాబు అని అసూయ కలిగించే అంత అందంగా ఉండే మహేష్ బాబు గురించి అనేక రకాల చర్చలు జరుగుతూ ఉంటాయి.
అయితే ఆ చర్చలు మరోసారి మొదలయ్యే విధంగా ఆయన భార్య నమ్రత శిరోద్కర్ మహేష్ బాబు తాజా ఫోటోలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 28వ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమాను మహేష్ బాబు 28వ సినిమా అని సంబోధిస్తున్నారు. ఈ సినిమాకు ఆరంభం అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది కానీ ఇప్పటివరకు అధికారిక క్లారిటీ అయితే రాలేదు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ మీద చినబాబు అలాగే నాగ వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
అయితే తాజాగా హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్ తన సోషల్ మీడియా వేదికగా మహేష్ బాబు హెయిర్ స్టైల్ చేసి ఒక ఫోటో షేర్ చేశారు. దానిని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన నమ్రత శిరోద్కర్ దానికి ఆసక్తికరమైన కామెంట్ కూడా పెట్టారు. ఇక ఈ ఫోటో ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వెంటనే అది వైరల్ అవ్వడం ప్రారంభించింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా మహేష్ బాబు కొత్త ఫోటో గురించే చర్చ జరుగుతోంది. ఇక ప్రస్తుతానికి మహేష్ బాబు షూటింగ్ నిలిపివేసి తన కుమారుడిని లండన్ లో డ్రాప్ చేసి వచ్చేందుకు లండన్ బయలుదేరినట్లు ప్రచారం జరుగుతోంది.
లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆయన సినిమా షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంది అని చెబుతున్నారు. ఇక మహేష్ బాబు త్రివిక్రమ్ తో సినిమా పూర్తి చేసిన తర్వాత రాజమౌళి డైరెక్షన్ లో ఒక సినిమా చేయబోతున్నారు. కేఎల్ నారాయణ నిర్మాణంలో రూపొందబోతున్న ఈ సినిమా ఇంకా ప్రారంభం కాలేదు కానీ ఇప్పటినుంచే సినిమా మీద అనేక ప్రచారాలు అయితే జరుగుతున్నాయి. ఈ సినిమా కథ అలా ఉంటుందని, ఇలా ఉంటుందని రకరకాల ప్రచారాలు తెరమీదకు వచ్చాయి. మరి చూడాలి ఏం జరగబోతోంది అనేది.
Also Read: Mahesh Babu London: షూట్ ఆపేసి మరీ విదేశాలకు మహేష్ బాబు.. అందుకేనంటూ ప్రచారం?
Also Read: Allu Arjun: ఇండియా..తగ్గేదే లే.. వైరల్ అవుతున్న బన్నీ ఎమోషనల్ స్పీచ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook