Ashok Galla Hero గత ఏడాది సంక్రాంతి సమయంలో కొత్త హీరోల సందడి ఎక్కువైంది. దిల్ రాజు ఫ్యామిలీ నుంచి ఒకరు, ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరొకరు వచ్చారు. దిల్ రాజు అన్న కొడుకు ఆశిష్ రౌడీ బాయ్స్ అంటూ వచ్చాడు. అందులో అనుపమతో ఆశిష్‌ రొమాన్స్ చేశాడు. ఇక అనుపమ మొదటి సారి స్క్రీన్ మీద లిప్ లాక్స్ పెట్టడంతో సినిమా మీద ఇంట్రెస్ట్ ఏర్పడింది. మరో వైపు నిధి అగర్వాల్ అందాల విందు చేస్తుండటంతో అశోక్ గల్లా హీరో మీద బజ్ ఏర్పడింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేశాయి. ఈ ఇద్దరి ఎంట్రీకి ఇచ్చిన బిల్డప్‌ను జనాలు పట్టించుకోలేదు. తన మొదటి సినిమా హీరో వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా అశోక్ గల్లా స్పందించాడు. '2022 సంవత్సరం నా జీవితంలో వృత్తిపరంగా మరియు వ్యక్తిగతంగా ఎన్నో అనూహ్యకరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇలాంటి ఆందోళకరమైన పరిస్థితుల మధ్య.... ఎంతో కాలంగా ఉన్న నా కల సాకారం అయ్యింది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే మా కుటుంబానికి.. మాటలకందని నష్టం కూడా జరిగింది.


 



హిట్లో సినిమా ను ఆదరించి... మీ కుటుంబ సభ్యుడిగా నన్ను ప్రేమిస్తున్న అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. ఈ జనవరి 15 నాటికి... నటుడిగా ఒక ఏడాది పూర్తి చేసుకున్న ఈ సందర్భంలో మీకు వ్యక్తిగతంగా నా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. తెలుగు సినిమా పరిశ్రమలో కష్టపడి, పని చేసి.. మీ అందరికీ వినోదం అందించే మంచి ఉద్దేశ్యంతో ఈ రంగంలోకి వచ్చిన నన్ను.. అంతే ఆనందంగా మీరు ఆదరించారు.


కానీ మీ అంచనాలు అందుకోలేనేమో...? అని కొంత భయపడుతున్న నాకు.. సినిమాకు సంబంధించి రిలీజ్ అయిన ప్రతీ అప్ డేట్ కి మీరు ఇచ్చిన ఆదరణ చూసి... కొండంత బలం వచ్చింది. మీ ప్రేమ, అభిమానం.. ఆశీస్సులు తోడుగా ఉన్నంతవరకూ.. నాకు నచ్చిన ఈ సినిమా రంగంలో... శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను. మిమ్మల్ని గర్వపడేలా చేస్తాను' అని అశోక్ గల్లా చెప్పుకొచ్చాడు.


Also Read:  Veera Simha Reddy Break even : మరీ ఇంత దారుణమా?.. చిరు మీద ఇంత కక్షా?.. బాలయ్య మీద అంత ప్రేమనా?


Also Read: Chiranjeevi : సెట్‌కు వెళ్లే ముందు ఇంట్లో వంట మనిషితో.. ఆసక్తికరమైన విషయాన్ని చెప్పిన చిరంజీవి 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook