Chiranjeevi VS Mahesh Babu మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. దీంతో మహేష్‌ బాబు ఫ్యాన్స్‌ కన్ఫ్యూజన్‌లో పడిపోయారు. చిరంజీవి భోళా శంకర్ సినిమాను ఆగస్ట్ 11న రిలీజ్ చేయబోతోన్నట్టుగా ప్రకటించారు. అయితే మహేష్‌ బాబు త్రివిక్రమ్ కాంబోలో రాబోతోన్న SSMB 28 సినిమాను కూడా అదే తేదీన రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈమేరకు గత రెండు నెలల క్రితమే నిర్మాత నాగవంశీ ప్రకటించాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మహేష్‌ బాబు బర్త్ డే ఆగస్ట్ 9న కాగా.. ఆగస్ట్ 11న ఈ సినిమా వస్తుండటంతో బ్యాక్ టు బ్యాక్ సెలెబ్రేషన్స్ ఉంటాయని మహేష్‌ బాబు ఫ్యాన్స్ సంబరపడిపోయారు. అయితే ఇప్పుడు భోళా శంకర్ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయడంతో గందరగోళం నెలకొంది. ఇలా రెండు పెద్ద సినిమాలను ఒకే సారి రిలీజ్ చేయడం కాస్త కష్టమే.


అంటే ఈ రెండు సినిమాల్లో ఏదో ఒకటి వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది. భోళా శంకర్ సినిమా షూటింగ్ అంతా సక్రమంగానే పూర్తవుతోంది. కానీ త్రివిక్రమ్ మహేష్‌ బాబు సినిమా షూటింగ్ మాత్రం ముందుకి వెనక్కి వెళ్తూనే ఉంది. ఈ లెక్కన చెప్పిన టైంకు మహేష్‌ బాబు రాలేకపోతాడా? అని అంతా అనుకుంటున్నారు.


అసలు ఆ టైం వరకు ఏ సినిమా ముందుకు వస్తుంది? ఏ సినిమా వెనక్కి తగ్గుతుంది? అసలు ఈ డేట్ గురించి చిరంజీవి, మహేష్‌ బాబు ముందుగా చర్చించుకున్నారా? కావాలనే ఇలా చేశారా? తెలియకుండా జరిగిందా? అన్నది మాత్రం క్లారిటీ లేదు. పైగా నిర్మాత అనిల్ సుంకర, దర్శకుడు మెహర్ రమేష్‌తో మహేష్‌ బాబుకి మంచి సంబంధాలున్న సంగతి తెలిసిందే.


ఈ ఉగాదికి భోళా శంకర్ నుంచి అప్డేట్ వచ్చింది. ఇక మహేష్‌ బాబు, పవన్ కళ్యాణ్‌, బాలయ్య సినిమాలకు సంబంధించిన అప్డేట్లు కూడా రెడీగానే ఉన్నట్టుగా కనిపిస్తోంది. కానీ మహేష్‌ బాబు త్రివిక్రమ్ సినిమా అప్డేట్ శ్రీరామనవమికి వచ్చేలా ఉంది.


Also Read:  Kota Srinivasa Rao : చనిపోయానంటూ వార్తలు.. పోలీసులు వచ్చారు.. కోట శ్రీనివాసరావు వీడియో వైరల్


Also Read: Nani With Anchor Suma: ప్రోమోల కోసం నాని కూడా ఇలా చేస్తున్నాడా?.. అవాక్కైన యాంకర్ సుమ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook