Mahesh Babu Trivikram Movie: 'సర్కారు వారి పాట' సినిమాతో మరో బ్లాక్‌బ్లస్టర్ హిట్ కొట్టిన మహేష్ బాబు తన నెక్స్ట్ మూవీని చకచకా పట్టాలెక్కించేస్తున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే దాదాపుగా పూర్తయ్యాయి. సాధారణంగా త్రివిక్రమ్ సినిమా అంటే తెర నిండా బోలెడు పాత్రలు కనిపిస్తాయి. మహేష్‌తో తెరకెక్కించబోయే మూవీకి కూడా త్రివిక్రమ్ భారీ తారాగణాన్నే తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే... ఈ సినిమాలో ఓ నందమూరి హీరో కూడా కనిపించనున్నాడట.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

త్రివిక్రమ్ చివరి సినిమా అలవైకుంఠపురంలో హీరోలు సుశాంత్, నవదీప్ కీలక పాత్రల్లో కనిపించిన సంగతి తెలిసిందే. మహేష్‌తో మూవీలోనూ ఓ కీలక పాత్రను పేరున్న హీరోతో చేయించాలని త్రివిక్రమ్ భావిస్తున్నారట. ఈ క్రమంలో నేచురల్ స్టార్ నాని తదితరుల పేర్లు వినిపించినప్పటికీ... ఫైనల్‌గా త్రివిక్రమ్ ఓ పేరును ఫిక్స్ చేశారనే గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఆ పాత్రను నందమూరి తారకరత్నతో చేయించేందుకు త్రివిక్రమ్ ఫిక్స్ అయ్యారట.ఈ సినిమా సెకండాఫ్‌లో నెగటివ్ షేడ్స్‌ ఉన్న పాత్రలో తారకరత్న కనిపించనున్నాడని టాక్. 


ఇప్పటికైతే దీనిపై చిత్ర యూనిట్ నుంచి కానీ లేదా త్రివిక్రమ్ నుంచి కానీ అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం తారకరత్న 'సారథి' అనే సినిమాతో చాలా గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్-మహేష్ కాంబినేషన్ విషయానికొస్తే... గతంలో ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడినప్పటికీ బుల్లితెరపై సూపర్ డూపర్ హిట్టయ్యాయి. అతడు సినిమా అయితే ఎవర్‌గ్రీన్ క్లాసిక్‌గా నిలిచిపోయింది. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తోందంటే చాలామంది టీవీకి అతుక్కుపోతారు. మహేష్-త్రివిక్రమ్ మరోసారి జతకడుతుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 


 


Also Read: RCB v LSG Eliminator: రికార్డు సృష్టించిన RCB v LSG మ్యాచ్.. CSK vs MI రికార్డు  బద్దలు!


Also Read: Dry Fruits Eating Tips: నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల శరీరానికి ఇన్ని ప్రయోజనాలా..!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి