మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా బాక్సాఫీస్ రేసులో దూసుకుపోతోంది. విడుదలైన 2 వారాల తర్వాత కూడా సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుండటాన్ని సినిమా యూనిట్ ఎంజాయ్ చేస్తోంది. ప్రస్తుతం విదేశాల్లో జాలీగా ఫారిన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న మహేష్ బాబు.. అక్కడి నుంచి రాగానే కొంత విశ్రాంతి తీసుకుని తన తర్వాతి ప్రాజెక్టు ప్రారంభించనున్నాడు. మహర్షి మూవీ డైరెక్టర్ వంశీ పైడిపల్లి మరోసారి ఈ సినిమాతో మహేష్ బాబును డైరెక్ట్ చేయనున్న సంగతి తెలిసిందే. సరిలేరు నీకెవ్వరు సినిమా (Sarileru Neekevvaru movie) సెట్స్‌పై ఉండగానే వీళ్లిద్దరి కాంబో సెట్ అయింది. ప్రస్తుతం వంశీ పైడిపల్లి సైతం కథకు తుది మెరుగులు దిద్దుతున్నాడు. మహేష్ బాబు విదేశాల నుంచి రాగానే మరోసారి ఫైనల్ స్టోరీ వినిపించడంతో పాటు సినిమాకు అవసరమైన క్యాస్ట్ అండ్ క్రూను సెటిల్ చేసుకోనున్నారు. మహేష్ బాబు - వంశీ పైడిపల్లి కాంబోలో రానున్న మూవీకి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఏంటంటే.. ఈ సినిమాలో సూపర్ స్టార్ సరసన ఇద్దరు హీరోయిన్స్ నటించనున్నారట. అందులో ఒక ఫీమేల్ లీడ్ కోసం బాలీవుడ్ నటి, భరత్ అనే నేను ఫేమ్ కియారా అద్వానీని సంప్రదించినప్పటికీ.. కాల్ షీట్స్ ఖాళీ లేకపోవడంతో డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయిందని.. దీంతో ఆమె స్థానంలో మరొకరిని తీసుకునే పనిలో యూనిట్ ఉన్నట్టు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Related article : కేజీఎఫ్ డైరెక్టర్‌తో సినిమాపై స్పందించిన మహేష్ బాబు


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్ట్స్ ప్రాజెక్టుపై ఇన్ని వివరాలు తెలిసినప్పటికీ.. అభిమానులు ఇంకా తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తున్న విషయం ఏదైనా ఉందా అంటే.. అది ఆయన పాత్ర గురించే. అవును.. మహర్షి సినిమాలో (Maharshi movie) మిలియనీర్‌గా ఎదిగి రైతన్నలకు ఏదైనా మేలు చేయాలనే ఆశయం కలిగిన యువకుడిగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబును చూపించిన వంశీ పైడిపల్లి.. తన తర్వాతి ప్రాజెక్టులో ఏ విధంగా చూపించనున్నాడా అనే సందేహమే ఇప్పుడు మహేష్ బాబు అభిమానుల బుర్రను తొలిచేస్తోంది. అయితే, ఫిలింనగర్ వర్గాల అప్‌డేట్స్ ప్రకారం మహేష్ బాబు ఈ సినిమాలో ఓ స్పై పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..