Malayalam Actor Ambika Rao Death News : మలయాళ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ఇటీవలే టోవినో థామస్ సినిమా షూటింగ్లో ఒక నటుడు మరణించిన వార్త మరువక ముందే ఇప్పుడు మరో మలయాళ నటి, సహాయ దర్శకురాలు అంబికా రావు సోమవారం రాత్రి కన్నుమూశారు. ఆమె వయసు ప్రస్తుతం 58 సంవత్సరాలు. ఆమె అనారోగ్య కారణాలతో ఎర్నాకులంలోని ప్రైవేటు ఆస్పత్రిలో రాత్రి 10.30 గంటలకు తుది శ్వాస విడిచినట్లు చెబుతున్నారు. అక్కడ ఆమె గుండెపోటు కారణంగా మరణించారు. అంబికకు కోవిడ్ రావడంతో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆమెకు గుండెపోటు కూడా రావడంతో ఆమె కన్నుమూశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంబికారావు 2002లో సహాయ దర్శకురాలిగా సినీ పరిశ్రమలో తన కెరీర్‌ను ప్రారంభించారు. బాలచందర్ మీనన్ దర్శకత్వంలో కృష్ణ గోపాలకృష్ణ సినిమాలో సహాయ దర్శకురాలిగా పని చేశారు. దాదాపు రెండు దశాబ్దాల పాటు ఆమె సినీ రంగంలో పనిచేశారు. అంబిక 'కుంబళంగి నైట్స్‌'లో తన నటనతో గుర్తింపు పొందారు. అలాగే మమ్ముట్టి నటించిన 'రాజమాణిక్యం', 'తొమ్మనం మక్కల్' అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన 'వెలినక్షత్రం' వంటి సినిమాలకు ఆమె సహాయ దర్శకురాలిగా పనిచేసింది. 


అలాగే దిలీప్ నటించిన బ్లాక్ బస్టర్ 'మీషా మాధవన్', 'సాల్ట్ అండ్ పెప్పర్', 'అనురాగ్కారికిన్ వెల్లం', 'వెల్లం' వంటి అనేక సినిమాల్లో కూడా నటించారు.  అంబికా రావుకి మధు సి నారాయణ్ 'కుంబళంగి నైట్స్' సినిమాతో గుర్తింపు వచ్చింది. 2019లో విడుదలైన ఈ చిత్రంలో అంబికారావు ఇద్దరు బిడ్డలకు తల్లిగా నటించింది. ఇక అంబికకు రాహుల్, సోహన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.


అంబికా రావు అకాల మరణం పట్ల మలయాళ సినీ తారలు మరియు సాంకేతిక నిపుణులు సంతాపం వ్యక్తం చేశారు. పృథ్వీరాజ్ సుకుమారన్ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పృథ్వీరాజ్‌తో పాటు, మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన సాంకేతిక నిపుణులు కూడా అంబికా రావు మృతికి సంతాపం తెలుపుతూ ఆమెకు నివాళులర్పించారు. ఇటీవల విడుదలైన అనురాగ్ కరికిన్ వెల్లం, తమాషా, వెల్లం వంటి అనేక సినిమాల్లో కూడా నటించారు. 
Also Read: Movies Releasing this week: పక్కా కమర్షియల్ మొదలు ఈ వారం ఓటీటీ-థియేటర్లలో వచ్చే సినిమాలివే!


Also Read: Durex Wishes to Alia : ఇదేం వాడకంరా అయ్యా.. అలియా పెళ్ళికి అలా ఇప్పుడు ఇలా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.