Divya Prabha Harassment Air India Flight: ఎయిరిండియా విమానంలో తాగిన మత్తులో ఓ ప్రయాణికుడు తనను వేధించాడని మలయాళ నటి దివ్యప్రభ ఆరోపించింది. ఈ మేరకు ఆమె కేరళ పోలీసులను ఆశ్రయించగా.. ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వేధింపులకు పాల్పడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. "విమానంలో మద్యం మత్తులో ఉన్న తోటి ప్రయాణికుడు నన్ను వేధించాడు. ఎయిర్ హోస్టెస్‌కి రిపోర్ట్ చేసినా.. అతని వేధింపులు ఆగలేదు. టేకాఫ్‌కు ముందు నన్ను వేరే సీటులోకి మార్చారు. కానీ అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు." అని దివ్యప్రభ తన పోలీసు ఫిర్యాదులో పేర్కొంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొచ్చి వెళ్లాల్సిన ఎయిరిండియా విమానంలో ఓ ప్రయాణికుడు వేధింపులకు గురిచేశాడని తెలిపింది. ముంబై నుంచి విమానంలో వెళ్తుండగా మంగళవారం ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మంగళవారం రాత్రి తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో తనకు జరిగిన సంఘటనను వివరించింది. మద్యం మత్తులో తనను వేధించాడని ఆరోపించింది. ఎయిర్‌లైన్స్ గ్రౌండ్ ఆఫీస్, ఫ్లైట్ సిబ్బంది నుంచి వచ్చిన ప్రతిస్పందన తనకు నిరాశ కలిగించిందని తెలిపింది. 


ఎయిర్ హోస్టెస్‌కి ఫిర్యాదు చేస్తే తన సీటు మార్చారని.. విమానాశ్రయంలో దిగిన తర్వాత ఎయిర్‌లైన్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు దివ్య ప్రభ తెలిపింది. దీనికి సంబంధించి ఇమెయిల్ ద్వారా స్థానిక పోలీసులకు చేసిన ఫిర్యాదు కాపీని కూడా షేర్ చేసింది. మద్యం మత్తులో ఉన్న ప్రయాణికుడు తన సీటును ఆక్రమించుకుని తీవ్ర వాగ్వాదానికి దిగిన విషయాన్ని ఆమె గుర్తు చేసుకుంది. శారీరకంగా తాకేందుకు ప్రయత్నించాడని ఆరోపించింది.


నెడుంబస్సేరి పోలీసులు బుధవారం ఆమె నుంచి తమకు ఇమెయిల్ వచ్చిందని.. దానిని తన అధికారిక ఫిర్యాదుగా పరిగణిస్తున్నామని తెలిపారు. తాము ఈ విషయాన్ని పరిశీలిస్తున్నామని.. సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలను సేకరించడానికి దివ్య ప్రభను సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. దివ్య ప్రభ బుధవారం మధ్యాహ్నం తన ఇన్‌స్టాగామ్‌లో అప్‌డేట్‌ను పంచుకుంది. తనకు లభించిన అన్ని మద్దతుకు  కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని పోస్ట్ పెట్టింది. ఈ సమస్యపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశానని వెల్లడించింది.


Also Read: Jio Best Recharge Plan: ఇది కదా కావాల్సింది.. బెస్ట్ జియో రీఛార్జ్ ప్లాన్ ఇదే.. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీ  


 Also Read: Minor Sisters Killed: ప్రియుడితో రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన అక్క.. చెల్లెళ్లు చూశారని దారుణం..!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి