2018 Telugu Movie Review: ఈ మధ్యకాలంలో మలయాళంలో రూపొందిన సినిమాలన్నీ ఇతర భాషల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అక్కడ సినిమాలను నేరుగా కొన్నింటిని డబ్బింగ్ చేసి ఇతర భాషల్లో థియేటర్లలో రిలీజ్ చేస్తుంటే మరికొన్నింటిని మాత్రం ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. అలా ఓటీటీలో రిలీజ్ అయిన అనేక మలయాళ, సినిమాలు ఇప్పటికే మంచి టాక్ తెచ్చుకోగా ఇప్పుడు తాజాగా 2018 అనే సినిమా మలయాళంలో సూపర్ హిట్గా నిలిచింది. 10 కోట్ల బడ్జెట్ తో దాదాపు 130 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సినిమాని తెలుగు సహా ఇతర భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపద్యంలో తెలుగు మీడియా కి ముందే ప్రీమియర్ షో వేశారు. రివ్యూ చూసేద్దాం పదండి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2018 కథ విషయానికి వస్తే
కేరళలోని ఒక మారుమూల గ్రామానికి చెందిన అనూప్(టోవినో థామస్) ఎంతో ఇష్టపడి ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవుతాడు. అయితే అక్కడ పరిస్థితులు తట్టుకోలేక ఫేక్ మెడికల్ సర్టిఫికెట్ పెట్టి అనారోగ్యంతో పేరుతో సొంత గ్రామానికి వచ్చేస్తాడు. ఆర్మీ నుంచి బయటపడి దుబాయ్ వెళ్లి ఉద్యోగం చేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఈ సమయంలోనే ఢిల్లీ నుంచి ఆ ఊరికి వచ్చిన టీచర్ మంజు(తన్వి రామ్)తో ప్రేమలో పడతాడు. ఆమెతోనే పెళ్లి కూడా నిశ్చయం చేసుకున్న సమయంలో ఒక్కసారిగా కుండపోత లాంటి వర్షం మొదలవుతుంది. అది అల్పపీడనం అని తెలియడంతో ఊరిలో ఉన్న అందరిని క్యాంపులకు తరలిస్తారు. ఇక కేరళలో 2018లో వచ్చిన వరదల సమయంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి? అనేది ఈ సినిమా కథ. ఇక ఈ ప్రయాణంలో మత్స్యకార కుటుంబాలలో పుట్టి మోడల్ అవ్వాలనుకుంటున్న నిక్సన్(ఆసిఫ్ అలీ), అతని తండ్రి(లాల్), అన్నయ్య(నరైన్) వంటి వారు ఎలా సహాయపడ్డారు? అలాగే ఆ ఊర్లో ఉన్న వారందరూ ఎలా 2018 వరదల్లో బతికి బయటపడ్డారు అనేది ఈ సినిమా కథ.


Also Read: Malli Pelli Movie Controversy: మళ్ళీ పెళ్లి మూవీ గురించి స్పందిస్తూ నరేష్, పవిత్ర లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు


విశ్లేషణ
2018 ఆగస్టు నెలలో కేరళలో సంభవించిన వరదలు ఆ రాష్ట్ర మొత్తాన్ని అతలాకుతలం చేశాయి. కేరళ చరిత్రలోనే అతిపెద్ద వరదలుగా ఇప్పటికీ చెప్పబడే ఈ పరిస్థితుల నేపథ్యంలో దర్శకుడు జూడ్ ఆంటోనీ జోసెఫ్ ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రతి ఒక్కరూ పరోక్షంగానో, ప్రత్యక్షంగానో ఈ వరదల వల్ల ఇబ్బంది పడ్డారు. దీంతో కేరళలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ సినిమాకి మౌత్ టాక్ ద్వారా అట్రాక్ట్ అయ్యి అందరూ ఒక్కసారైనా చూసి తీరాల్సిందే అని థియేటర్లకు వెళ్లడంతో మలయాళంలోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అయితే నేరుగా తెలుగు రాష్ట్రాల ప్రజలు వరదలను ఫేస్ చేయకపోయినా కొన్ని ప్రాంతాల వారికి ఈ వరదలు కష్టాలు తెలుసు. దానికి తోడు దర్శకుడు రాసుకున్న కథా కథనాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా సాగాయి. మొదటి భాగం అంతా పాత్రల పరిచయానికే దర్శకుడు కేటాయించాడు.


ఒకానొక దశలో ఎన్ని పాత్రలు ఉన్నాయంటే ఒక్కొక్క పాత్రకు మరో పాత్రతో అసలు సంబంధం ఏమిటి అనే విషయం కూడా మనకు అర్థం కాదు. మొదటి భాగం మీద ఏమాత్రం ఆసక్తి కలగక పోవడంతో సెకండ్ హాఫ్ కి కూడా అలాగే ఎంటర్ అయిన ప్రేక్షకులు అందరినీ ఒక్కసారిగా వరదల్లో ముంచెత్తిన విధంగా కథనాన్ని ముందుకు తీసుకు వెళ్ళాడు దర్శకుడు. మనం కూడా వరదల్లో చిక్కుకున్న ఎదుటివారిని కాపాడేద్దాం అనే అంతలా మన మనసులను సిద్ధం చేయించాడు దర్శకుడు.


సినిమా చూస్తున్నంత సేపు ఆ వరదల్లో మనమే ఉన్నాం, మన స్నేహితులు, బాగా తెలిసిన వారు వరదల్లో చిక్కుకున్నారు వాళ్ళని కాపాడేయాలి అనే విధంగా లీనమయ్యేలా కథా రాసుకుని కథనాన్ని పరిగెత్తించాడు జూడ్. అలాగే సినిమాగా చూస్తే అద్భుతం అని చెప్పలేం కానీ కొన్ని కొన్ని సన్నివేశాలు మాత్రం ప్రేక్షకులందరికీ చేత చప్పట్లు కొట్టిస్తాయి, కొన్నిచోట్ల కన్నీళ్లు పెట్టిస్తాయి. ముఖ్యంగా ఆటిజంతో బాధపడుతున్న కుమారుని రక్షించుకునేందుకు ఒక జంట పడే కష్టం చూస్తే మనమే వెళ్లి కాపాడదామా అనిపిస్తుంది. అదేవిధంగా హీరో ఒక గర్భవతిని ఎయిర్ లిఫ్ట్ చేసే సన్నివేశం ఆ తర్వాత జరిగిన కొన్ని సన్నివేశాలు అప్రయత్నంగానే చప్పట్లు కొట్టిస్తాయి. 


నటీనటుల విషయానికి వస్తే


ఈ సినిమాలో మలయాళ సినీ పరిశ్రమకు చెందిన వారు చాలామంది కనిపించారు. తొవినో థామస్, వినీత్ శ్రీనివాసన్, నరేన్, లాల్, అపర్ణ బాలమురళీ వంటి వారు కనిపించారు. అలాగే తమిళ సినీ పరిశ్రమకు చెందిన ఇద్దరు కూడా కనిపించారు. అలాగే ఈ సినిమాలో ఎవరు నటించారు అని అనలేము కానీ జీవించారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతి ఒక్కరు తమ తమ పాత్రలకు నూటికి నూరు శాతం న్యాయం చేసి సినిమాని వేరే లెవెల్ తీసుకువెళ్లడంలో ప్రయత్నించారు.


టెక్నికల్ టీం విషయానికి వస్తే


ఈ సినిమాలో ప్రతి ఒక్కరూ దాదాపుగా బెస్ట్ అవుట్ ఫుట్ ఇచ్చేందుకు ప్రయత్నించారు. సినిమాటోగ్రఫీ మొదలు వీఎఫ్ఎక్స్, కంప్యూటర్ గ్రాఫిక్స్, నేపథ్య సంగీతం ఇలా ప్రతి ఒక్కటి సినిమాని నెక్స్ట్ లెవెల్ తీసుకువెళ్లడంలో సహాయ పడ్డాయి. 


ఒక్కమాటలో చెప్పాలంటే 
2018- ఎవ్రీ వన్ ఈజ్ హీరో సినిమా ఖచ్చితంగా చూడాల్సిన సర్వైవల్ థ్రిల్లర్. 


Rating: ⭐️⭐️⭐¼ 


Also Read: Ashu Reddy Photos: దుబాయిలో మెడలో ఐడీ కార్డు వేసుకుని అషు రెడ్డి ఫోజులు.. ఏం చేస్తోంది చెప్మా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK