Malli Pelli Movie Controversy: మళ్ళీ పెళ్లి మూవీ గురించి స్పందిస్తూ నరేష్, పవిత్ర లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

మళ్ళీ పెళ్లి మూవీ రిలీజ్‌ని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా రమ్య రఘుపతి పిటిషన్ దాఖలు చేయడంతో పాటు సినిమాకు సంబంధించిన విశేషాలు, అలాగే తమ నిజ జీవితంలో జరగబోయే మళ్ళీ పెళ్లి అంశంపై సైతం నరేష్, పవిత్ర లోకేష్ కలిసి స్పందిస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ వాళ్లిద్దరూ ఏమన్నారో తెలియాలంటే ఇదిగీ ఈ ఫుల్ డీటేల్స్ చూడాల్సిందే.

Written by - ZH Telugu Desk | Last Updated : May 25, 2023, 06:57 PM IST
Malli Pelli Movie Controversy: మళ్ళీ పెళ్లి మూవీ గురించి స్పందిస్తూ నరేష్, పవిత్ర లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

Naresh and Pavitra Lokesh About Malli Pelli Movie Release Issue: ప్రముఖ సీనియర్ నటుడు నరేష్, నటి పవిత్ర లోకేష్ ఇద్దరూ కలిసి నటించిన మళ్ళీ పెళ్లి సినిమా రేపు శుక్రవారం విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే, మళ్ళీ పెళ్లి మూవీ రిలీజింగ్ సమీపిస్తున్న తరుణంలో ఈ చిత్రం విడుదలను నిలిపేయాల్సిందిగా కోరుతూ నరేష్ భార్య రమ్య రఘుపతి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నరేష్, రమ్యరఘుపతి, పవిత్ర లోకేష్ రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగానే ఈ సినిమాను తెరకెక్కించారని ఆరోపించిన రమ్య రఘుపతి... తన అనుమతి లేకుండానే తన పాత్రపై సినిమా తీయడమే కాకుండా తమ పాత్రను అభ్యంతరకరమైన రీతిలో చూపించారు అని రమ్య రఘుపతి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అందువల్లే మళ్లీ పెళ్లి మూవీ రిలీజ్ అడ్డుకోవాల్సిందిగా రమ్య రఘుపతి తన పిటిషన్ ద్వారా కోర్టుకు విజ్ఞప్తి చేశారు. 

ఇదిలావుంటే మళ్ళీ పెళ్లి మూవీ రిలీజ్‌ని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా రమ్య రఘుపతి పిటిషన్ దాఖలు చేయడంతో పాటు సినిమాకు సంబంధించిన విశేషాలు, అలాగే తమ నిజ జీవితంలో జరగబోయే మళ్ళీ పెళ్లి అంశంపై సైతం నరేష్, పవిత్ర లోకేష్ స్పందిస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నరేష్, పవిత్ర లోకేష్ మాట్లాడుతూ.. రమ్య రఘుపతి పిటిషన్ పై కోర్టు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. కోర్టు నిర్ణయాన్నిబట్టి తమ న్యాయ పోరాటం కొనసాగుతుంది అని స్పష్టంచేశారు. 

ఈ సందర్భంగా మళ్ళీ పెళ్లి మూవీ గురించి మాత్రమే కాకుండా.. రియల్ లైఫ్‌లో తాము నిజంగానే చేసుకోబోయే పెళ్లి గురించి నరేష్ మాట్లాడుతూ.. " వీ ఆర్ ఆల్రెడీ వన్ " అని తమ మధ్యలో ఏం జరుగుతోంది అనేది చెప్పుకొచ్చారు. నరేష్, పవిత్ర లోకేష్ ఆల్రెడి పెళ్లి చేసుకుని ఆ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారా ? లేదంటే ఆ ఇద్దరూ ఇప్పటికే కలిసి ఉంటున్నారా ? అంటూ సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనాలకు తగినట్టుగానే నరేష్ మాట్లాడుతూ వీ ఆర్ ఆల్రెడీ వన్ అని వ్యాఖ్యానించడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.

పెళ్లి చేసుకున్నాకా వచ్చే తొలి బర్త్ డే మీకు ఈసారి మరింత స్పెషల్ కానుంది కదా అనే ప్రశ్నకు నరేష్ స్పందిస్తూ.. ప్రతీ సంవత్సరం తాను బర్త్ డే సెలబ్రేట్ చేసుకోననని. తనని అభిమానించే వారు చేసుకోవాలి కానీ తాను చేసుకోవాలి అనుకునే రకం కాదని అన్నారు. కాకపోతే ఈసారి వచ్చే పుట్టిన రోజు మాత్రం చాలా ప్రత్యేకమే అవుతుంది అని అంగీకరించారు. దానికి తమ పెళ్లి మాత్రమే కారణం అని కాకుండా.. విజయ కృష్ణ బ్యానర్ రీలాంచ్ చేసి సినిమా కూడా ప్రారంభించడం వంటి కొత్త కొత్త కారణాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. 

పవిత్ర లోకేష్ తో పెళ్లి తరువాత వారసుడు, పిల్లలు అని ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అని హోస్ట్ అడిగిన ప్రశ్నకు నరేష్ కుండబద్ధలు కొట్టినట్టు సమాధానం చెప్పారు. జీవితంలో పెళ్లి అంటే కేవలం పెళ్లాం, పిల్లలు కోసమే కాదని.. ఆమాటకొస్తే, అసలు పిల్లలే లేకున్నా జీవితంలో ఎంతో హ్యాపీగా ఉన్న జంటలు ఎంతో మంది ఉన్నారని అన్నారు. తమ రియల్ లైఫ్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ అంత హ్యాపీగా లేదని.. అందుకే సెకండ్ ఇన్నింగ్స్ అయినా లైఫ్ తమకు నచ్చినట్టుగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం అని చెబుతూ పరోక్షంగా ప్రస్తుతం తమ జీవితాల్లో మనశ్శాంతి లేదని తెలిపారు.

ఇది కూడా చదవండి : Malli Pelli Movie: మళ్లీ పెళ్లి సినిమా ఆపాలంటూ.. నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి పిటిషన్‌!

పెళ్లి తరువాత పిల్లలు కనే అంశం గురించి నరేష్ మరింత మాట్లాడుతూ.. " ఇప్పటికే తమకు పిల్లలు ఉన్నారు. అలాగే తమను ప్రేమించే తమ సొంత మనుషులు, కుటుంబాలు తమ చుట్టూ ఉన్నాయి కనుక కొత్తగా పిల్లల కోసమే మేం పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదని.. జీవితానికి ఒక తోడు కావాలి. తోడుగా నిలిచే ఆ బంధంలో నమ్మకం ఉండాలి. అది అందరికీ దొరకదు. కానీ మా ఇద్దరిలో ఒకరికొకరం ఆ బంధాన్ని, నమ్మకాన్ని చూసుకున్నాం. అందుకే ఇద్దరం మళ్ళీ పెళ్లి చేసుకుని జీవితాన్ని కలిసి పంచుకోవాలి " అని అనుకుంటున్నాం అని నరేష్, పవిత్ర లోకేష్ ఏ దాపరికం లేకుండా ఎంతో సింపుల్‌గా చెప్పారు.

ఇది కూడా చదవండి : Telugu Movies this week: తెలుగు ప్రేక్షకుల ముందుకు ఇంట్రెస్టింగ్ చిన్న సినిమాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

More Stories

Trending News