Chaithanya Master Suicide మల్లెమాల, ఆ సంస్థలో వచ్చే షోల గురించి అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా మల్లెమాల మీద, జబర్దస్త్ వంటి షోల మీద నాగబాబు చేసిన కామెంట్లు, ఇతర ఆర్టిస్టులు చేసిన కామెంట్లు అందరికీ తెలిసిందే. ఆర్టిస్టులు కష్టాల్లో ఉంటే కూడా పట్టించుకోదని కిరాక్ ఆర్పీ వంటివారు ఆరోపణలు చేశారు. భోజనాలు కూడా సరిగ్గా పెట్టదని ఇలా ఎన్నో రకాలుగా కామెంట్లు చేశాడు. జబర్దస్త్ షోలో రెమ్యూనరేషన్‌ల మీద సైతం కామెంట్ చేశాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే మల్లెమాల తరుపున వకాల్తా పుచ్చుకున్నట్టుగా ఆది, రాం ప్రసాద్‌లు బయటకు వచ్చి ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆర్పీ చెప్పిన వాటిని ఖండించారు. అయితే ఇప్పుడు ఢీ కొరియోగ్రాఫర్ చైతన్య మాస్టర్ అప్పుల బాధను భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన చివరగా మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అందులో ఆయన ఢీ షోలో ఇచ్చే రెమ్యూనరేషన్లు, జబర్దస్త్ షో గురించి చెప్పుకొచ్చాడు.


మల్లెమాల గుర్తింపును ఇచ్చిందని, ఢీ షో వల్ల ఫేమ్, నేమ్ వచ్చిందని, ఎప్పటికీ రుణపడి ఉంటానని అన్నాడు. అయితే ఢీ షోలో చేస్తే గుర్తింపు వచ్చింది కానీ డబ్బు రాలేదని, జబర్దస్త షోలో ఎక్కువ డబ్బు ఇస్తారని, అయినా ఢీ షోలో ఉన్నామని ఇలా తన ఆర్థిక సమస్యలు చెబుతూ ఆ వీడియోను ముగించాడు. ఆ తరువాత తన తనువుని కూడా చాలించాడు చైతన్య మాస్టర్.


Also Read: Anchor Manjusha : అందమంతా మంజూష దగ్గరే ఉన్నట్టుందే.. ఆహా అనిపించేలా యాంకర్.. పిక్స్ వైరల్


అంటే ఢీ షోలో మాస్టర్లకే ఇలా ఉంటే.. అందులో చేసే కంటెస్టెంట్లు, సైడ్ డ్యాన్సర్ల పరిస్థితి ఎలా ఉంటుందో అని అంతా అనుకుంటున్నారు. మొత్తానికి చైతన్య మాస్టర్‌కు మాత్రం తనకు వచ్చిన గుర్తింపు తన ఆర్థిక సమస్యలను దూరం చేయలేకపోయాయని అర్థం అవుతోంది. అప్పుల బాధ తట్టుకోలేకపోతోన్నాను అని, అమ్మానాన్న, ఢీ షో డ్యాన్సర్లు, మాస్టర్లు, కంటెస్టెంట్లు అందరూ తనను క్షమించాలని కోరాడు.


Also Read:  Chaithanya Master Suicide : ఢీ కొరియోగ్రఫర్ మృతి.. ఆ కారణాలతోనే సూసైడ్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook