Manchu Manoj Dance Video: తెలుగు రాష్ట్రాల్లో నాగ చైతన్య, శోభితా పెళ్లి మ్యాటర్ ను పుష్ప 2 రిలీజ్ వెనక్కి నెట్టేసింది. పుష్ప 2 ఇష్యూ నాగబాబుకు ఏపీ క్యాబినేట్ లో మంత్రి పదవి హైజాక్ చేసింది. అయితే..ఈ ఇష్యూస్ అన్నింటిని పక్కన పెట్టి ఇపుడు మోహన్ బాబు ఇంట్లో జరిగిన గొడవ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. వీరి కుటుంబ గొడవ రచ్చ కెక్కడంతో అందరి దృష్టి దానిపైనే పడింది. ఇంట్లో నాలుగు గోడల కుటుంబ సభ్యుల మధ్య జరగాల్సిన చర్చ కాస్త రచ్చ కెక్కి వారి కుటుంబం పరువు బజారున పడింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నేపథ్యంలో మంచు మనోజ్,విష్ణు మధ్య మోహన్ బాబు మధ్య ఆస్తులను సరైన విధంగా పంపకాలు చేయకుండా.. తనపై తండ్రి వివక్ష చూపిస్తున్నట్టు మంచు మనోజ్ రచ్చ కెక్కారు. అప్పట్లో మంచు మనోజ్.. తన మొదటి పెళ్లి తర్వాత భార్యకు ఇంట్లో వాళ్లతో పడక.. వేరేగా ఉందామన్నా.. కుటుంబ సభ్యులతో ఉన్న అనుబంధం కారణంగా వద్దన్నారు. దీంతో ఆమె మంచు మనోజ్ కు విడాకులు ఇవ్వాలని కోరింది. విడాకులు ఇస్తే.. తన ఆస్తిలో మెజారిటీ భాగం ఆమెకు భరణంగా ఇవ్వాల్సివస్తుందన్న కారణంతో అప్పట్లో తన ఆస్తి మొత్తాన్ని అన్న విష్ణు పేరున మంచు మనోజ్ రాసేసాడనే టాక్ నడుస్తోంది.


ఆ తర్వాత రెండో పెళ్లి తర్వాత తనకు వాటాలకు రావాల్సిన ఆస్తిని అన్నయ్యతో పాటు తండ్రిని అడగటం వారు ఏ విషయం చెప్పకపోవడంతో మంచు మనోజ్ రచ్చ కెక్కాల్సి వచ్చింది. మొత్తంగా మొదటి భార్యకు భరణం ఇవ్వకుండా చేయడానికి తన పేరున ఉన్న ఆస్తిని అన్నయకు రాయడం...ఆయనకు ఆస్తిని తమ్ముడుకు అప్పజెప్పకపోవడం వంటివి ఇందులో ప్రధాన భాగం అని చెప్పాలి.  తాజాగా వారెంట్లో జరిగిన ఈ ఉదంతంపై తాజాగా చల్లారినట్టు తెలుస్తోంది. దీంతో మంచు  ఫ్యామిలీకి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో మంచు మనోజ్‌ మద్యం మత్తులో చేసిన హంగామా దృశ్యాలు కనిపిస్తున్నాయి. కుటుంబ పెద్దలతో సైతం మనోజ్‌ అమర్యాదగా ప్రవర్తించాడని మోహన్‌ బాబు చేసిన ఆరోపణలకు ఇది సాక్ష్యంగా నిలుస్తోంది. ఫామ్‌హౌస్‌లో జరిగిన ఈ హంగామాకు సంబంధించిన వీడియో ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.


ఇదీ చదవండి: Nagababu Cabinet: ముగ్గురు మొనగాళ్లు.. దేశంలోనే మొదటిసారి..


ఇదీ చదవండి: ఫామ్ హౌస్ రౌడీ.. ఆది నుంచి మోహన్ బాబు తీరు వివాదాస్పదం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.