Manchu Lakshmi On Samantha Shaakuntalam మంచు లక్ష్మీ తాజాగా ట్విట్టర్‌లో సమంత నటించిన శాకుంతలం ట్రైలర్ మీద స్పందించింది. గుణ శేఖర్ తెరకెక్కించిన ఈ సినిమాను దిల్ రాజు, నీలిమ గుణ సంయుక్తంగా నిర్మించారు. ఇక దిల్ రాజు అయితే ఈ సినిమాకు కోసం ఎంతైనా ఖర్చు పెట్టుకో అని గుణ శేఖర్‌కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టున్నాడు. షూటింగ్ ఆరు నెలలో చేసినా కూడా ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్‌ కలిసి రెండేళ్లు చేసినట్టుగా గుణ శేఖర్ తెలిపాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమా ట్రైలర్‌ ఓ వర్గాన్ని బాగానే మెప్పించింది. కానీ ఇందులో బాహుబలి ఛాయలు కనిపించాయని, సమంత ఎంట్రీ సీన్ తమన్నా సీన్‌లా ఉందని, మాహిష్మతి రాజ్యంలానే సృష్టించాడని ఇంకా కొత్తగా ఏమీ చేయలేదనే టాక్ కూడా వస్తోంది. అయితే ఈ ట్రైలర్‌ సమంత సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. అయితే ఈ ట్రైలర్ మీద తాజాగా మంచు లక్ష్మీ స్పందించింది.


 



సమంత.. నువ్ శాకుంతలంగా గ్రేస్‌తో అదరగొట్టేశావ్.. నాన్నా.. నిన్ను దుర్వాస మహర్షిగా చూడటం అద్భుతం అనిపిస్తోంది.. భరతుడిగా అర్హ పాప ఎంతో క్యూట్‌గా ఉంది.. ఈ ట్రైలర్ చూడటానికి ఎంతో బాగుంది అని తన ఆనందాన్ని వ్యక్తం చేసింది మంచు లక్ష్మీ.


కానీ శాకుంతలం ట్రైలర్ మీద మాత్రం చాలా మంది పెదవి విరుస్తున్నారు. ఇందులో వాడిని సీజీ, గ్రాఫిక్స్, వీఎఫ్‌ఎక్స్ ఏ మాత్రం అంత ఎఫెక్టివ్‌గా లేవని ట్రోల్స్ చేస్తున్నారు. కానీ గుణ శేఖర్, సమంత రేంజ్‌కు ఇదే ఎక్కువ అని కొంత మంది కౌంటర్లు వేస్తున్నారు. మరి ఫిబ్రవరి 17న శాకుంతలం ఎలాంటి వండర్లు క్రియేట్ చేస్తుందో చూడాలి. పాన్ ఇండియన్ రేంజ్‌లో అన్ని భాషల్లో ఈ సినిమాను విడుదల చేయబోతోన్నారు.


Also Read: Keerthy Suresh Bikini : బికినీలో కీర్తి సురేష్‌.. మహానటిని ఇలా ఎప్పుడూ చూసి ఉండరు.. హీటెక్కించే పిక్స్


Also Read: Shaakuntalam Trailer.. శాకుంతలం ట్రైలర్.. మెస్మరైజ్ చేసిన సమంత.. అల్లు అర్హ ఎంట్రీ అదుర్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి