Manchu Manoj - Mounika Tributes to Bhuma Nagireddy & Shobha: సుదీర్ఘకాల జరుగుతున్న ప్రచారం ఎట్టకేలకు నిజమైంది. మంచు మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ భూమా మౌనికను వివాహం చేసుకున్నారు. మార్చి మూడవ తేదీన సాయంత్రం 8 గంటల 30 నిమిషాలకు జరిగిన ఈ వివాహానికి మంచు మోహన్ బాబు సహా పలువురు కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపి తమ ఆశీస్సులు అందించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే నిన్న మొత్తం రెస్ట్ తీసుకున్న ఈ జంట ఈ రోజు మాత్రం భూమా మౌనిక రెడ్డి నివాసానికి వెళ్లారు. ముందుగా ఈ ఉదయం హైదరాబాద్ నుంచి కర్నూల్ విమానంలో వెళ్లిన ఈ జంట కర్నూలులో ఉన్న ఎస్వీ సుబ్బారెడ్డి నివాసానికి వెళ్ళగా అక్కడి నుంచి బయలుదేరి కొద్దిసేపటి క్రితం ఆళ్లగడ్డలో ఉన్న భూమా నాగిరెడ్డి శోభా నాగిరెడ్డి ఘాట్ కి వెళ్లి నివాళులర్పించారు. భూమా నాగిరెడ్డి శోభా నాగిరెడ్డి ఇద్దరూ స్వర్గస్తులైన సంగతి తెలిసిందే, ఇక ఎస్ వి సుబ్బారెడ్డి స్వయానా భూమా నాగిరెడ్డి బావమరిది కావడంతో ఆయన నివాసానికి నూతన వధూవరులు వెళ్లారు.



 



ఇక అక్కడి నుంచి భారీ కాన్వాయ్ తో ఆళ్లగడ్డ వెళ్లి ఆళ్లగడ్డలో వారి ఘాట్ కు వెళ్లి నివాళులర్పించారు. ఇక మంచు మనోజ్ సహా భూమా నాగమౌనిక నివాళులర్పిస్తున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెళ్లయిన వెంటనే మనోజ్ తన అత్తారింటికి వెళ్లారు అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. మంచు మనోజ్ వాస్తవానికి గతంలోనే ఒక యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. కానీ ఎక్కువ కాలం ఆ బంధం సాగలేదు. దీంతో వారు విడాకులు తీసుకున్నారు.


మరోపక్క భూమా నాగ మౌనిక రెడ్డి కూడా 2016లో బెంగళూరుకు చెందిన గణేష్ అనే ఒక వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు. కానీ వారి వివాహం కూడా ఎక్కువ కాలం కొనసాగలేదు. 2018లో నాగభైరవరెడ్డి అనే కుమారుడు జన్మించిన తర్వాత వారి మధ్య దూరం పెరిగింది. దీంతో వారు కూడా విడాకులు తీసుకున్నారు ఎట్టకేలకు ఇప్పుడు మనోజ్-మౌనిక ప్రేమలో పడటంతో పెద్ద అంగీకారంతో వివాహం చేసుకున్నారు. 
Also Read: Ileana Dcruz Sab Gajab: ఉల్లిపొర లాంటి చీరలో అన్నీ కనిపించేలా ఇల్లీ బేబీ హాట్ ట్రీట్.. తట్టుకోవడం కష్టమే!


Also Read: Supritha Photos: పొట్టి బట్టల్లో సురేఖా వాణి కూతురు రచ్చ.. హీరోయిన్లను మించిన హాట్ షో!




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


 TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి