Manchu Manoj : చావనైనా చస్తా!.. నువ్వూ బతుకు నన్నూ బతకనివ్వు.. దండం పెట్టేస్తూ మంచు మనోజ్ పోస్ట్
Manchu Manoj Shares suzy kassem Quotes మంచు మనోజ్ మంచు విష్ణు మధ్య ఉన్న విబేధాలు బయటకు వచ్చాయి. అన్నాదమ్ములిద్దరూ ఇలా కొట్టుకోవడంతో మంచు పరువంతా కరిగిపోయి రోడ్డు మీదకు వచ్చినట్టు అయింది.
Mohan Vishnu on Manchu Manoj మంచు వారి ఫ్యామిలీలో చీలికలు ఇప్పుడు అందరికీ అర్థమయ్యాయి. మంచు బ్రదర్స్ మధ్య ఎంత దూరం ఏర్పడిందో ఒక్క వీడియో చెప్పేసింది. ఈ ఇద్దరి మధ్య గ్యాప్ ఉందనే రూమర్లు గత కొన్ని నెలల నుంచి వస్తూనే ఉంది. అయితే ఇప్పుడు అవన్నీ నిజం అని అందరికీ తెలిసి వచ్చింది. నిన్న మనోజ్ షేర్ చేసిన వీడియో, అందులో విష్ణు గొడవకు దిగుతున్న విజువల్స్ అందరికీ తెలిసిందే. ఈ గొడవ మీద మోహన్ బాబు స్పందించాడు. గొడవలు సహజమేనని అన్నాడు. ఇక మంచు లక్ష్మీ అయితే తనకేమీ తెలియదని చెప్పుకొచ్చింది.
తాజాగా మంచు మనోజ్ షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఇందులో సుజి కాసీమ్ కొటేషన్‌ను షేర్ చేశాడు. నిజం కోసం చావనైనా చస్తాను అంతే గానీ.. ఈ తప్పుల మధ్య ఇలా బతకలేను అని అన్నాడు. ఇక నెగెటివిటీ అనేది క్రియేటివిటీకి మూలం అని అన్నాడు. అయితే వీటిని షేర్ చేసిన మనోజ్ ఇలా ట్వీట్ వేశాడు. బతుకు.. బతకనివ్వు.. అంటూ దండం పెట్టేస్తూ ట్వీటేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
అయితే ఈ ట్వీట్‌కు నిన్న జరిగిన గొడవకు జనాలు లింక్ పెడుతున్నారు. ఫ్యామిలీలో ఏదో జరుగుతోందని, తప్పులు చేస్తున్నట్టుగా ఉన్నారని, వాటిని మనోజ్ చూస్తూ ఉండలేకపోయాడా? అందుకే ఇప్పుడు ఇలాంటి ట్వీట్ వేశాడా? ఆ కొటేషన్‌ను అందుకే షేర్ చేశాడా? అని అంతా అనుకుంటున్నారు. అసలు ఆ సారథి ఎవరు? మోహన్ బాబు దగ్గర ఉండే అతను.. మనోజ్ వద్దకు ఎందుకు వచ్చాడు? మనోజ్ వద్ద ఉన్న సారథిని మంచు విష్ణు ఎందుకు కొట్టాడు? అసలు ఈ అన్నాదమ్ములిద్దరి మధ్య ఏం జరిగింది? అనేది తెలియడం లేదు.
సారథి చుట్టే ఈ వివాదం జరుగుతోంది. సారథి కోసం మనోజ్ నిలబడ్డాడని, అందుకే ఈ గొడవలు ఏర్పడ్డాయని తెలుస్తోంది. అయితే మనోజ్ చిన్న పిల్లవాడని, ఇదేమీ పెద్ద గొడవ కాదని, ఇంత చేయాల్సిన పని లేదని, మనోజ్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టాడంటూ విష్ణు స్పందించిన సంగతి తెలిసిందే. వీడియోను అలా బయటపెట్టడంపై మనోజ్ మీద మోహన్ బాబు సైతం ఫైర్ అయినట్టుగా తెలుస్తోంది.
Also Read: Manchu Family Fighting : మంచు బ్రదర్స్ వివాదం.. రంగంలోకి మోహన్ బాబు?.. వెనక్కి తగ్గిన మనోజ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook