Special Pooja At Film Nagar Temple: అయోధ్యలో రామ మందిరాన్ని ప్రారంభిస్తూ ఈ మహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు  కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు. ఇది శ్రీరాముడు జన్మభూమి అని ప్రపంచం అంతా చాటి చెప్పేలా చేశారు ప్రధాని మోడీ అని అన్నారు. శ్రీరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట సందర్భాన్ని పురస్కరించుకుని ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫిల్మ్ నగర్‌లో దైవ సన్నిధానం దేవాలయాన్ని అందరి కోసం నిర్మించామని మోహన్ బాబు తెలిపారు. ఈ మధ్య కాలంలో దైవ సన్నిధానం పాలక మండలి చైర్మన్ పదవిని తాను స్వీకరించారని చెప్పారు. ఈ దేవాలయంలో 18 మూర్తులు, 15 మంది బ్రాహ్మణోత్తములున్నారు. ఈ దైవ సన్నిధానంలో కోరిన కోరికలన్నీ తీరుతున్నాయని భక్తులు చెబుతున్నారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి, సాయి బాబా, శ్రీరాముడు, లక్ష్మీ నరసింహ స్వామి, సంతోషిమాత ఇలా 18 మంది దేవతలు ఇక్కడ కొలువై ఉన్నారని తెలిపారు. 


ఇది రాముడు పుట్టిన దేశం.. ఇది రామ జన్మ భూమి అని ప్రపంచానికి చాటి చెప్పేలా చేశారు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ అని మోహన్‌ బాబు తెలిపారు. అయోధ్యలో రామ మందిరాన్ని ప్రారంభిస్తూ ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలియజేశారు మోహన్‌ బాబు. 


Also Read: Kriti Sanon Pics: కృతి సనన్ కిక్కిచ్చే హాట్ షో.. చూస్తే తట్టుకోలేరు భయ్యా..


జనవరి 22న రామ మందిర ప్రారంభోత్సవం జరుగుతుందని.. ఈ కార్యక్రమం కోసం వేలాది మంది ఊరూరా తరలి వెళ్తున్నారని చెప్పారు. తనకు కూడా అహ్వానం అందింది తెలిపారు.  కానీ భద్రతా కారణాల దృష్ట్యా రాలేకపోతున్నాని.. తనను క్షమించమని లేఖ రాశారని తెలిపారు. రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా దైవ సన్నిధానంలోనూ ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. అందరూ వచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు. 


Also Read: RAM Rapid Action Mission: రిపబ్లిక్ డే కానుకగా ఆడియన్స్‌ ముందుకు ‘రామ్‌’ మూవీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter