Vishnu Manchu Donation: సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబు.. మొదటి నుంచి తన వద్దకు సహాయం కావాలి అని వచ్చిన వారికి.. లేదనకుండా చేసేవారు. ఇప్పుడు అదే దానిని ఫాలో అవుతున్నారు.. మోహన్ బాబు కొడుకు మంచు విష్ణు. మంచు విష్ణు ప్రస్తుతం కన్నప్ప సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం భారీ బడ్జెట్ తో.. పాన్ ఇండియా పరంగా ఈ సంవత్సరం చివరిలో విడుదల కానుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమాలో మంచు విష్ణు తో పాటు.. వివిధ భాషలకు చెందిన ఎంతోమంది స్టార్ నటులు నటిస్తున్నారు. ప్రభాస్, మోహన్ లాల్, కాజల్, నయనతార, మధుబాల.. ఇలా ఎంతోమంది నటీనటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. వీరందరికీ సంబంధించిన పోస్టర్లు.. ఒక్కొక్కటి విడుదల అవుతూ ప్రేక్షకులలో మరింత ఆసక్తి తెప్పిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్, ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. తాజాగా విష్ణు చేసిన ఒక పని సోషల్ మీడియాలో అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంది.


విష్ణు మంచు..మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా పని చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ మా ప్రెసిడెంట్..తన కూతురు ఐరా విద్యా మంచు పుట్టిన రోజు సందర్భంగా.. గొప్ప పనికి పూనుకున్నారు. ఈ క్రమంలో ఆర్థికంగా వెనకబడిన వాడికి పది లక్షల విరాళాన్ని ప్రకటించారు. అసోసియేషన్‌లో ఆర్థికంగా వెనుకబడిన కళాకారుల సంక్షేమం కోసం.. మంచు విష్ణు పది లక్షలు విరాళంగా అందించారు. కళాకారులకు సహాయం చేయడం.. అలానే వారికి అవసరమైన సంరక్షణ చూసుకోవడం కొరకు.. ఈ డబ్బుని అందజేశాడు. 


2022 నుంచి..మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మంచు విష్ణు నాయకత్వంలో అద్భుతమైన అభివృద్ధిని సాధించింది. అంతేకాదు మా భవనంపై విష్ణు తన దృష్టి పెట్టాడు. ఇక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్లు, సినీ ఆర్టిస్టుల మీద సోషల్ మీడియాలో వస్తోందా అసత్యపు కథనాలు, ట్రోలింగ్‌ను కట్టడి చేసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు.


చాలామంది సోషల్ మీడియా వారు అలానే యూట్యూబర్‌లు…నటులు, వారి కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన పోస్టులను వేస్తున్న సంగతి తెలిసిందే. కాగా అలాంటి అసభ్యమైన పోస్టులను.. తీసి వేయించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు విష్ణు మంచు. ఇక విష్ణువు తీసుకున్న ఈ నిర్ణయాన్ని.. సినిమా వారు ఎంతో అభినందిస్తున్నారు.   
కాగా ప్రస్తుతం విష్ణు ‘కన్నప్ప’ చిత్రం ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు.


Also Read: YS Viveka Murder Case: వైఎస్ జగన్ చెల్లెలు సంచలనం.. వైఎస్‌ వివేకా హత్యపై కీలక పరిణామం


Also Read: Andhra Pradesh: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్‌.. ఇకపై ఆ నిబంధన ఉండదు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి