Manchu Vishnu Daughters మంచు విష్ణు విరానికల పెళ్లి రోజు (మార్చి 1) సందర్భంగా నిన్న ఓ కొన్ని పోస్టులు కనిపించాయి. తన భార్య మీద ప్రేమను కురిపిస్తూ మంచు విష్ణు వేసిన పోస్ట్ అందరినీ కదిలించింది. నిన్ను చూస్తూ ఉన్న ప్రతీక్షణం ప్రేమలో పడుతూనే ఉంటున్నాను అంటూ తన భార్య మీద ప్రేమను కురిపించాడు మంచు విష్ణు. అయితే తన అమ్మ నాన్నల పెళ్లి రోజు సందర్భంగా అరియానా, వివియానా స్పెషల్‌గా సర్ ప్రైజ్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మంచు విష్ణు కూతుళ్లిద్దరూ (వివియానా, అరియానా) జిన్నా సినిమాలో పాట పాడిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ ప్రొఫెషనల్ సింగర్లుగా పాటలు పాడారు. ఈ ఇద్దరూ సంగీతాన్ని కూడా నేర్చుకున్నట్టుగా కనిపిస్తోంది. అయితే ఈ ఇద్దరూ ఇప్పుడు తమ తల్లిదండ్రుల కోసం కదిలి వచ్చారు. ఒకరు పాటను డిజైన్ చేస్తూ.. ఇంకొంకరు ఆ పాటను అందంగా పాడారు. తన కూతుళ్లిద్దరూ కలిసి చేసిన ఈ పాటను, అందులోని భావాన్ని చూసి మంచు విష్ణు కంట్లో నీళ్లు తిరిగాయట.


మంచు విష్ణు సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటాడన్న సంగతి తెలిసిందే. తన ఫ్యామిలీ, పిల్లల గురించి ఎప్పుడూ పోస్ట్ చేస్తూనే ఉంటాడు. మంచు ఫ్యామిలీ ఫోటోలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక మంచు విష్ణు లవ్ స్టోరీ, మోహన్ బాబుని పెళ్లికి ఒప్పించేందుకు పడ్డ తంటాలు ఇది వరకు ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.


 



మంచు విష్ణు జిన్నా సినిమాతో ఘోర పరాజయాన్ని చవి చూశాడు. డిజాస్టర్లలో లిస్ట్‌లోకి జిన్నా సినిమా ఎక్కేసింది. అయితే జంబలకిడి జారు మిఠాయా అంటూ జిన్నా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాడిన పాట, ఆ పాడిన వ్యక్తి మాత్రం ఫుల్ ట్రెండ్ అయింది. జిన్నా సినిమా కంటే ఆ పాటే ఎక్కువగా జనాల్లోకి వెళ్లిన విషయం తెలిసిందే. ఇప్పుడు మంచు విష్ణు డబుల్ డోస్ అంటూ శ్రీను వైట్లతో సినిమా చేసేందుకు రెడీగా ఉన్నాడనిపిస్తోంది.


Also Read:  Balagam Movie Review : బలగం మూవీ రివ్యూ.. తెలంగాణకు అద్దం పట్టేలా


Also Read: Pragya Jaiswal Bikini : బాలయ్య భామ బికినీ ట్రీట్.. వెనకాల జరిగే పనులపై నెటిజన్ల ట్రోల్స్.. పిక్స్ వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook