Payal Rajput next film: ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై తన బోల్డ్ క్యారెక్టర్ తో అందరినీ ఆకర్షించిన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. కాగా ఆ తర్వాత ఈ హీరోయిన్ కి ఎన్నో బోల్డ్ సినిమాలు వచ్చినా కానీ అవి rx100 అంత పేరు మాత్రం తెచ్చి పెట్టలేదు. ఇక మధ్యలో వెంకటేష్, నాగచైతన్య సినిమా వెంకీ మామ లో నటిచ్చిన ఆ చిత్రం కూడా ఆమెకు ఆఫర్ల పరంగా సహాయ పడలేక పోయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక ఇన్ని రోజులకు ఇప్పుడు మళ్లీ పాయల్ కి ఆర్ఎక్స్ 100 రేంజ్ హిట్ పడింది. మరోసారి ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతితో మంగళవారం అనే సినిమాలో నటించింది పాయల్. నవంబర్ 17 అనగా నిన్న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది. అంతేకాదు మరోసారి పాయల్ రాజ్ పుత్ క్యారెక్టర్ ని అందరూ ప్రశంసిస్తున్నారు.


ఇక ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న సూపర్ హిట్ పాయల్ కి ఈ చిత్రంతో వచ్చింది. కాగా ఇప్పుడు ఈమె ఏకంగా ఒక స్టార్ హీరో సినిమాలో సెలెక్ట్ అయింది అని ఒక వార్త సినీ వర్గాల్లో తెగ హల చల్ చేస్తోంది.


పాన్ ఇండియా స్టార్ హీరో అల్లు అర్జున్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ కి ఓ లీడ్ లో నటించే అవకాశం వచ్చిందంటూ ఓ న్యూస్ వినిపిస్తోంది. ఇటీవల జరిగిన పాయల్ మంగళవారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా అల్లు అర్జున్ సందడి చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు అల్లు అర్జున్, పాయల్ కలిసి తగ్గేదే లే ఫోజ్ ఇచ్చి ఇంస్టాగ్రామ్ లో కూడా పోస్ట్ చేశారు. ఇందులో భాగంగానే ఆమెకు అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కంబోలో వస్తున్న పాన్ ఇండియా మూవీలో అవకాశం ఇచ్చినట్లు వివరించారట. 


దీంతో ఒకపక్క మంగళవారం సినిమాతో సూపర్ హిట్.. మరోపక్క పాన్ ఇండియా హీరోతో ఆఫర్.. ఇలా రెండు లక్కీ ఛాన్సులు ఒకేసారి కొట్టేసింది పాయల్. మరి ఇకనైనా ఈ హీరోయిన్ కి తగిన ఛాన్సులు, పాపులారిటీ వస్తుందేమో చూడాలి.


Also Read: World Cup 2023: ఐసీసీ ప్రపంచకప్ 2023 విజేతకు రన్నర్ జట్లకు ఇచ్చే ప్రైజ్‌మనీ ఎంతంటే


Also Read: Poco M4 5G Price: 50MP కెమెరా Poco M4 5G మొబైల్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.11,000లోపే పొందండి!



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి