Manjummel Boys Telugu Box Office Collections:కంటెంట్ ఉంటే కటౌట్ పనిలేదని కొన్ని సినిమాలు చూస్తే నిజమే అనిపిస్తోంది. మలయాళంలో ఈ కోవలో వచ్చిన పలు చిత్రాలు బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి. నిర్మాతలకు కాసులు వర్షం కురిపిస్తున్నాయి. ఈ యేడాది ప్రేమలు సినిమా తెలుగులో మంచి వసూళ్లనే రాబట్టింది. పూర్తిగా హైదరాబాద్ బ్యాక్ గ్రౌండ్‌లో తెరకెక్కిన మలయాళీ మూవీకి తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. ఆ తర్వాత మలయాళంలో థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన 'మంజుమ్మేల్ బాయ్స్' మూవీని తెలుగులో అదే టైటిల్‌తో తెరకెక్కించారు. ఈ సినిమా ఇక్కడ పాజిటివ్ టాక్ తెచ్చుకొంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమా తెలుగులో రూ. 2.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 3 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగిన ఈ సినిమా తెలుగులో ఓవరాల్‌గా రూ. 7.25 కోట్ల షేర్ (రూ. 14.40 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది. మొత్తంగా తెలుగులో 4.25 కోట్ల లాభాలతో డబుల్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.


ఈ సినిమా తెలుగుతో పాటు మలయాళం ఇతర భాషల్లో వసూళు చేసిన కలెక్షన్స్ విషయానికొస్తే..


ఈ సినిమా మలయాళంలో రూ. 72.10 కోట్ల గ్రాస్
తెలుగు రాష్ట్రాలు.. రూ. 14.40 కోట్ల గ్రాస్
తమిళనాడు - రూ. 63 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
కర్ణాటక - రూ. 15.75 కోట్లు..
రెస్ట్ ఆఫ్ భారత్ - రూ. 2.60 కోట్ల గ్రాస్..
ఓవర్సీస్ - 73.40 కోట్ల గ్రాస్..


ప్రపంచ వ్యాప్తంగా రూ. 241.25 కోట్ల గ్రాస్.. (రూ. 115 కోట్ల షేర్) రాబట్టి మలయాళ సినీ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా ఫిబ్రవరిలో రిలీజై మంచి సక్సెస్ అందుకుంది. అంతేకాదు మలయాళ సినీ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అంతేకాదు అక్కడ రూ. 200 కోట్లు వసూళ్లు రాబట్టిన చిత్రంగా సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది.


మంజుమ్మేల్ బాయ్స్ కథ విషయానికొస్తే.. మంజుమ్మేల్ అనే పట్టణంలో ఉండే ఫ్రెండ్స్ కొడైకెనాల్ ట్రిప్ ప్లాన్ చేస్తారు. అక్కడ అనుకోకుండా ఒకతనుడు ఓ గుహలో చిక్కుకుపోతాడు. అతన్ని రక్షించడానికి ఆ బృందంలో ఉండే ఫ్రెండ్స్ ఎలాంటి ప్రయత్నాలు చేసారు. ఈ క్రమంలో గుహలో చిక్కుకుపోయిన స్నేహితుడిని ఎలా రక్షించారనేదే ఈ సినిమా స్టోరీ.


Read more: Swati maliwal: ఎన్నికల వేళ మరో బాంబు పేల్చిన స్వాతీమలీవాల్.. అసలేం జరిగిందంటే..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter