Swati maliwal hot comments on arvind kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతీమలీవాల్ ఘటన దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జైలు నుంచి విడుదలయ్యాక ఆయనను కలిసేందుకు వెళ్లిన స్వాతీ మాలీవాల్ కు షాకింగ్ అనుభవం ఎదురైంది. కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ స్వాతి మలీవాల్ పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా.. ఆమెను ఇష్టమున్నట్లు కొట్టాడని ఆమె ఫిర్యాదు చేశారు. మఖంపై, చెంపలపై పిడిగుద్దులు కురిపించారంటూ ఆమె తీవ్రమైన ఆరోపణలు చేశారు. పొత్తి కడుపులో కాలితో తన్నుతూ, పీరియడ్స్ లో ఉన్నానని, ప్రాధేయ పడిన వదల్లేదని పోలీసుల ముందు స్వాతీమలీవాల్ తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు మలీవాల్ కు ఆస్పత్రికి తరలించి టెస్టులు చేయించారు. ఆమెకు అంతర్గతంగా దెబ్బలున్నాయని వైద్యులు చెప్పారు.
Read more: Black milk: ఈ జంతువులు ఇచ్చే పాలు నల్లగా ఉంటాయి... కారణం ఏంటో తెలుసా..?
ఇక.. పోలీసులు కేజ్రీవాల్ పీఏను అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయనను పోలీసులు విచారిస్తున్నారు. ఇక ఈ ఘటన ప్రస్తుతం పొలిటికల్ టర్న్ తీసుకుందని చెప్పుకొవచ్చు. స్వాతీమలీవాల్ బీజేపీకి ఏజెంట్ గా మారిందని ఆప్ సీనియర్ నేతలు, మంత్రులు విమర్శిస్తున్నారు. ఇప్పటికే దీనిపై ఇటు కాంగ్రెస్ నేతలు, అటు బీజేపీ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇటీవల ఢిల్లీ సీఎం కూడా ఈ ఘటనపై స్పందించారు. ఇరువురి వాదనలు విని, స్వాతీమలీవాల్ ఘటనలో న్యాయం చేయాలని అన్నారు. ఇది కోర్టుపరిధిలో ఉందని ఇంతకంటే, ఎక్కువ వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని అన్నారు. మరోవైపు ఎంపీ స్వాతీమలీవాల్ మరో సంచలన ఆరోపణలు చేశారు.
మే 13 న తాను కేజ్రీవాల్ ఇంటికి వెళ్లినప్పుడు సీఎం ఇంట్లోనే ఉన్నారని ఆమె అన్నారు. బిభవ్ కుమార్ తనను కొడుతున్న ఎవరు అక్కడికి రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. గట్టిగా కేకలు వస్తున్న, అక్కడున్న వారు కనీసం రెస్పాండ్ కాలేదని చెప్పుకొచ్చింది. ఇంతజరుగుతున్న.. కనీసం సీఎం కేజ్రీవాల్ తనను ఒక్కసారి కూడా ఫోన్ చేసి మాట్లాడలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Read more: Bhootonwala mandir: ఒక్క రాత్రిలో దెయ్యాలు కట్టిన ఆలయం.. దీని విశిష్టతో ఏంటో తెలుసా..?
ఇప్పటికే తనను తిట్టాలని ఆప్ సీనియర్ మంత్రులకు, ఆదేశించారని తెలిపారు. కొందరు కావాలని తన ఫోటోలను మార్ఫింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపణలు చేశారు. ఈఘటనలో ఎవరికి కూడా తాను క్లీట్ చీట్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. తనకు న్యాయం జరిగే వరకు ఎంతదూరమైన వెళ్లేందుకు తాను వెనుకాడబోనని స్వాతీమలీవాల్ స్పష్టం చేశారు. ఈ ఘటనపై ఇప్పటికే ఆప్ నేతలు, స్వాతీమాలీవాల్ పై ఆరోపణలు గుప్పించారు. ఎన్నికల ముందు ఆప్ కు కావాలనే చెడ్డపేరు వచ్చేలా, బీజేపీ ఇలా చేయిస్తుందంటూ కూడా ఎద్దేవా చేస్తున్నారు. మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ సైతం ప్రజలు తమను భారీమెజార్టీతో గెలిపించాలని ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆప్ గెలిస్తే, తాను జైలుకు వెళ్లాల్సిన అవసరం ఉండదంటూ కూడా కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యలు చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter