poovaiyar Buys New Car : చిన్నతనంలో బొమ్మలు కావాలి, కారు బొమ్మలు కావాలని పిల్లలంతా మారాం చేస్తుంటారు. కానీ అదే పిల్లాడు ఓ లగ్జరీ కారును కొనేస్తే ఎలా ఉంటుంది. కారు నడిపే వయసు కూడా రానీ, లేని ఓ పిల్లాడు కారుకి ఓనర్ అయ్యాడు. ఆ స్థాయిలో ఆ బుడ్డోడు సంపాదించేస్తున్నాడు. అతడే పూవయార్. తమిళ్ సూపర్ సింగర్స్ పోటీల్లో సెకండ్ రన్నర్ అయినా కూడా పూవయార్‌కు మంచి క్రేజ్ వచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ తరువాత దళపతి విజయ్ బిగిల్ సినిమాలోని ఎంట్రీ సాంగులో అదరగొట్టేశాడు. వెర్రీతనం పాట పూవయార్ విజయ్ పక్కన డ్యాన్స్ చేసి అదరగొట్టేశాడు. అలా పూవయార్‌కు మంచి క్రేజ్ వచ్చింది. అయితే ఆ తరువాత మాస్టర్ సినిమాలో పూవయార్ నటించేశాడు. ఆ సీన్లు కూడా బాగానే పండాయి. విజయ్ కాంబోలో ఉన్న సీన్లు పూవయార్‌కు మంచి క్రేజ్ వచ్చింది.


పాటలు, సినిమాలు అంటూ పూవయార్ చిన్నతనంలోనే బాగా సంపాదించేసుకున్నాడు. అయితే ఈ బుడ్డోడు ఇప్పుడు కొత్త కారు కొనేశాడు. టాటా పంచ్ మోడల్‌ను కొనేశాడు పూవయార్. ఈ కారు విలువ ఆరు లక్షల నుంచి పది లక్షల మధ్య ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి పూవయార్ మాత్రం చిన్న వయసులో పెద్ద పెద్ద వాటిని సాధించేస్తున్నాడు.


పూవయార్ స్టేజ్ మీద మాట్లాడే మాటలకు అందరూ ఫిదా అవుతుంటారు. ఇక షోల్లో పూవయార్ మాటలు, పాటలకు అందరూ నవ్వేస్తుంటారు. ప్రస్తుతం పూవయార్ కొన్న కొత్తకారు ఫోటోలు వైరల్ అవుతున్నాయి. బుడ్డోడు గ్రేట్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 


Also Read : RC 15 : దిల్ రాజు టీం అశ్రద్ద.. రామ్ చరణ్ అంజలి పిక్స్ లీక్


Also Read : Kalyaan Dhev-Sreeja Konidela : నవిష్కతో కళ్యాణ్ దేవ్.. శ్రీజ కూతురికి దూరంగా


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook