Sreeja Konidela Daughter : శ్రీజ కూతురిపై పోస్ట్.. నవిష్కతో కళ్యాణ్ దేవ్.. డాటర్స్ డే స్పెషల్ పిక్స్ వైరల్

Kalyaan Dhev Special Post కళ్యాణ్‌ దేవ్ ప్రస్తుతం ఓ పోస్ట్ వేయడంతో కొన్ని అనుమానాలు రేకెత్తాయి. ఇంటర్నేషనల్ డాటర్స్ డే అంటూ కళ్యాణ్‌ తన కూతుళ్ల గురించి చెప్పుకొచ్చాడు. కానీ ఫోటోలో మాత్రం నవిష్క మాత్రమే కనిపిస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 12, 2022, 08:31 AM IST
  • ఇంటర్నేషనల్ డాటర్స్ డే
  • అనుమానాలు పుట్టించిన కళ్యాణ్‌ దేవ్ పోస్ట్
  • శ్రీజ కూతురికి దూరంగా కళ్యాణ్ దేవ్
Sreeja Konidela Daughter :  శ్రీజ కూతురిపై పోస్ట్.. నవిష్కతో కళ్యాణ్ దేవ్.. డాటర్స్ డే స్పెషల్ పిక్స్ వైరల్

Sreeja Konidela Daughter :  కళ్యాణ్‌ దేవ్ శ్రీజ కొణిదెల మధ్య జరుగుతున్న విషయం గురించి వచ్చే కథనాల గురించి అందరికీ తెలిసిందే.  ఈ ఇద్దరూ విడిపోయారని, కలిసి ఉండటం లేదనే వార్తలు వస్తూనే ఉంటాయి. అయితే ఈ రూమర్ల మీద మాత్రం అటు మెగా ఫ్యామిలీ గానీ, ఇటు కళ్యాణ్‌ దేవ్ ఫ్యామిలీ గాని స్పందించడం లేదు. శ్రీజ తన ఇన్ స్టా హ్యాండిల్ పేరు మార్చడంతో ఈ రూమర్లు ఎక్కువగా అయ్యాయి. అప్పటి వరకు శ్రీజ కళ్యాణ్‌ అని ఉన్న ఇన్ స్టా హ్యాండిల్ పేరు.. శ్రీజ కొణిదెలగా మారింది. దీంతో ఈ ఇద్దరి విడాకుల వార్తలకు, రూమర్లకు బలం చేకూరింది.

గత ఏడాది డిసెంబర్లో ఈ వార్తలు ఎక్కువగా వైరల్ అయ్యాయి. కళ్యాణ్‌ దేవ్ సైతం మెగా ఈవెంట్లు, సెలెబ్రేషన్స్‌లో కనిపించడం మానేశాడు. సంక్రాంతి, దీపావళి ఇలా ఏ పండుగ సెలెబ్రేషన్స్‌లోనూ కళ్యాణ్‌ దేవ్ కనిపించలేదు. ఇక కళ్యాణ్‌ దేవ్ సినిమాలను మెగా ఫ్యామిలీ పట్టించుకోవడం మానేసింది. ఆయన సినిమాలను ప్రమోట్ చేసేందుకు మెగా ఫ్యామిలీ ముందుకు రాలేదు.

నిహారిక, శ్రీజ, నవిష్క ఇలా అందరూ కూడా కళ్యాణ్‌ దేవ్‌ను అన్ ఫాలో అయ్యారు. శ్రీజ అయితే కళ్యాణ్‌ దేవ్ ఫోటోలు, పోస్టులను షేర్ చేయడం మానేసింది. పాత వాటిని డిలీట్ కూడా చేసింది. కొన్ని రోజులు అయితే కళ్యాణ్‌ దేవ్ కూతురు నవిష్క.. శ్రీజ వద్దే కనిపించేది. కళ్యాణ్ దేవ్ తన కూతురికి కూడా దూరంగా ఉన్నట్టు అనిపించింది.

అయితే మధ్యలో నవిష్కతో కళ్యాణ్‌ దేవ్ ఆడుకుంటున్న వీడియోలు, ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి. దీంతో కళ్యాణ్‌ దేవ్, శ్రీజ కలిసి పోయారా? అని అంతా అనుకున్నారు. కానీ ఈ ఇద్దరి జోడికి సంబంధించిన విషయాలు మాత్రం అధికారికంగా బయటకు రావడం లేదు. తాజాగా కళ్యాణ్‌ దేవ్ ఓ పోస్ట్ వేశాడు. దీంతో అందరిలోనూ కొత్త అనుమానాలు పుట్టుకొచ్చాయి.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kalyaan Dhev (@kalyaan_dhev)

ఆడ పిల్లలు హాయిగా, స్వేచ్చగా, ప్రశాంతంగా బతికేందుకు ఈ ప్రపంచం ఎంతో సురక్షితంగా మారుతుందని ఆశిస్తున్నాను.. హ్యాపీ ఇంటర్నేషనల్ డాటర్స్ డే అంటూ నివృత్తి, నవిష్కలను ట్యాగ్ చేశాడు కళ్యాణ్‌ దేవ్. అయితే ఇందులో నవిష్కతో ఉన్న ఫోటోలను మాత్రమే కళ్యాణ్‌ దేవ్ షేర్ చేశాడు. నివృత్తి ఫోటోలను షేర్ చేయకపోవడంతో.. వీరిద్దరి మధ్య ఉన్న విబేధాలు గురించి అంతా చర్చించుకుంటున్నారు. మీరిద్దరు కలిసి ఉన్నారా? లేక విడిపోయారా? ఏదో ఒక క్లారిటీ ఇవ్వండని నెటిజన్లు కళ్యాణ్‌ దేవ్ పోస్ట్ కింద కామెంట్లు చేస్తున్నారు.

Also Read : RC 15 : దిల్ రాజు టీం అశ్రద్ద.. రామ్ చరణ్ అంజలి పిక్స్ లీక్

Also Read : Bollywood Affairs: ఎంగేజ్‌మెంట్ తర్వాత పెళ్లి కాకముందే బ్రేకప్ చెప్పుకున్న జంటలు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News