Mega 154 Waltair Veerayya Title Teaser Mega Fans on Full Josh: రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు, అయితే ఆ తర్వాత ఆయన నుంచి వస్తున్న సినిమాలన్నీ నిరాశ పరుస్తున్నాయి. దీంతో ఆయన నుంచి ఒక సూపర్ హిట్ పడితే చూడాలని ఎంతో కాలంగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఇటీవల విడుదలైన గాడ్ ఫాదర్ అలాగే మెహర్ రమేష్ డైరెక్షన్ లో రూపొందుతున్న భోళా శంకర్ రెండు రీమేక్ సినిమాలే కావడంతో ఆ రెండింటి మీద అంతగా ఫోకస్ పెట్టలేదు. [[{"fid":"249636","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే డైరెక్టర్ బాబీ రూపొందిస్తున్న 154వ సినిమా మీద మెగా అభిమానులలో ముందు నుంచే అంచనాలున్నాయి. ఈ సినిమా కోసం ఒక్క మెగా ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సాధారణ ప్రేక్షకులు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవితో పాటు రవితేజ కూడా కనిపించబోతున్నాడు.[[{"fid":"249637","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


చిరంజీవి సరసన శృతి హాసన్ నటిస్తోన్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ ఇచ్చిన సంగీతం, పాటలు హైలెట్ అవ్వనున్నాయి. టైటిల్ టీజర్ తోనే మెగా ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించేశారు. ‘’ఏంట్రా ఆడొస్తే పూనకాలన్నాడు.. అడుగేస్తే అరాచకం అన్నాడు..[[{"fid":"249638","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]


ఏడ్రా మీ అన్నయ్య.. సౌండే లేదు.. అంటూ ఫైట్ మాస్టర్ శివ చెప్పే డైలాగ్ వెంటనే రివర్స్ ఆర్డర్‌లో స్క్రీన్ ప్లేని తీసుకెళ్తూ.. బీడీ తాగుతూ బాంబ్ బ్లాస్ట్ చేసిన చిరంజీవిని చూపించాడు బాబీ. అంతేకాక ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అంటూ బాస్ చెప్పిన డైలాగ్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.[[{"fid":"249639","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]


చివర్లో చిరు అలా నడుచుకుంటూ రావడం, బీడీ వెలిగించుకోవడం అన్నీ కూడా ఫాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అందరివాడు, ముఠామేస్త్రీ సినిమాలను గుర్తు తెచ్చేలా.. బీడీ తాగుతూ స్టైలిష్‌గా లుంగీలో నడుచుకుంటూ వస్తూ స్టన్నింగ్‌ మాస్‌ లుక్‌లో చిరంజీవి రచ్చ రేపుతున్నాడు. [[{"fid":"249640","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"5":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"5"}}]]



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook