Naga Babu tested Covid-19 Positive: కరోనావైరస్ (Coronavirus) అంతటా వినాశనం చేస్తూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు.. ఇలా ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు. ఇటీవల కాలంలో టాలీవుడ్‌లో చాలామంది ప్రముఖులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా మెగాబ్రదర్ నాగ‌బాబుకు (Mega Brother Naga Babu ) కూడా క‌రోనా పాజిటివ్‌గా నిర్థార‌ణ అయింది. అయితే నాగబాబుకి కరోనా సోకిందంటూ.. రెండు రోజుల సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ నాగబాబు స్పందించలేదు. అయితే తనకు కరోనా సోకిన విషయాన్ని నాగబాబు ట్విట్టర్ ద్వారా మంగళవారం రాత్రి వెల్లడించారు. Also read: India: 50 లక్షలు దాటిన కరోనా కేసులు.. నిన్న ఒక్కరోజే 1,290 మంది మృతి



ఇన్ఫెక్షన్ సోకిందని బాధపడటం కంటే.. దాని నుంచి కోలుకుని వేరొకరికి సాయం చేయాలి.. నాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ మహమ్మారిని తొంద‌ర‌గా జ‌యించి ప్లాస్మా దాతనవుతా.. అంటూ నాగబాబు ట్వీట్‌ చేశారు. దీంతో ఆయన త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షిస్తూ.. మెగా అభిమానులు ఆయన చేసిన ట్విట్‌కి రీట్వీట్లు చేస్తున్నారు.  Also read: Oxford COVID-19 Vaccine: క్లినికల్ ట్రయల్స్‌కు డీసీజీఐ అనుమతి