Niharika Konidela: ఆ విషయంలో మా అత్త కాళ్లు మొక్కాలంటున్న మెగా డాటర్!
Niharika Konidela Comments on Mother in Law: తన అత్తా గురించి మెగా డాటర్ నిహారిక చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, తన అమ్మ కంటే ఆ విషయంలో ఆమె చాలా బెటర్ అంటూ ఆమె పేర్కొన్నారు.
Mega Daughter Niharika Interesting Comments on her Mother in Law: మెగా డాటర్ నిహారిక సినిమాలలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కానీ ఎందుకు ఆమెకు ఆ హీరోయిన్ అవకాశాలు బాగానే వచ్చినా నిలదొక్కుకునే సినిమా ఒకటి కూడా చేయలేకపోయింది. ఇక ఆమె సినిమా హీరోయిన్ అవ్వాలంటే అనేక కట్టుబాట్లు తెంచుకొని బయటికి రావాల్సి ఉంటుంది, అన్నీ తెంచుకుని ఆమె బయటకు వచ్చినా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి కాస్త ఎక్స్పోజింగ్ చేయాలంటే మిగతా హీరోలతో నటించడం కూడా ఇబ్బందికరమైన విషయమే.
ఒక హీరోతో నటిస్తే ఏకంగా ఆయనతో పెళ్ళంటూ అప్పట్లో కామెంట్లు రావడంతో ఆ తర్వాత ఆమె నటిగా కంటే ఎక్కువగా నిర్మాతగా నిలదొక్కునేందుకు ప్రయత్నం చేస్తూ వస్తోంది. ఒక ప్రొడక్షన్ హౌస్ కూడా స్టార్ట్ చేసి ఒకటి రెండు సినిమాలు కొన్ని వెబ్ సిరీస్ లు కూడా నిర్మించింది. ఇప్పుడు కూడా ఆమె వెబ్ సిరీస్ నిర్మాణం మీదే దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. చైతన్య జొన్నలగడ్డ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తన వివాహ అనంతర జీవితం గురించి తాజాగా నిహారిక పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో నిహారిక మాట్లాడుతూ తాను తన పుట్టింట్లో ఒక ప్రిన్సెస్ లాగా ఉండేదాన్ని ఇప్పుడు అత్తారింట్లో కూడా దాదాపు అదే పరిస్థితి ఉందని ఆమె కామెంట్ చేశారు.
నిజానికి చిన్నప్పటి నుంచి తాను పెళ్లి తర్వాత ఎదురయ్యే పరిస్థితుల గురించి ఎక్కువగా ఆలోచించలేదని ఆ తర్వాత పెళ్లయిన కొన్ని రోజులు గడిస్తే కానీ నేను ఎందుకు ఇలాంటి విషయాలన్నీ ఆలోచించలేదా అని అనిపించిందని చెప్పకొచ్చారు. తన అత్తారింటిలో కూడా ఇప్పుడు స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుందని తన అత్తయ్య మామయ్య చాలా స్వీట్ పర్సన్స్ అని నిహారిక కామెంట్ చేశారు. అత్తమ్మ ఫుడ్ అని అంటే నేరుగా ఆమె వచ్చి తినిపిస్తుందని నన్ను చాలా కేరింగ్ చూసుకుంటారని నీహరిక చెప్పుకొచ్చారు. అత్తయ్య, మామయ్య ఇద్దరూ కూడా మేము నిన్ను చూసుకుంటాం నువ్వు మా చైతన్యను చూసుకో అమ్మ అని అంటూ ఉంటారని తాజాగా నిహారిక కామెంట్ చేశారు.
ఇక మా ఇంట్లో ఉదయం 10 గంటలకు నిద్రలేచేదాన్ని తలుపు కొట్టి నిద్రలేపే వారని అత్తగారింట్లో మాత్రం అసలు తలుపు కూడా కొట్టారని అని చెప్పుకొచ్చారు. ఇక ఈ విషయంలో అత్తమ్మ కాళ్లు మొక్కాలి అంటూ నిహారిక చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మా నాన్న చిన్నప్పటినుంచి నేను ఎక్కడికి వెళ్లాలి అని అడిగినా పెళ్లయ్యాక మీ ఆయనతో కలిసి వెళ్ళు అనేవారని అందుకే ఇప్పుడు ఎక్కువగా ట్రావెలింగ్ చేస్తున్నానని నిహారిక చెప్పుకొచ్చారు.
Also Read: దక్షిణ కొరియా నుంచి రాగానే సమంత దగ్గరకు చైతూ.. అసలు విషయం అదేనా?
Also Read: Prabhas Sister: నానికి వదిన అంటే నమ్మారు.. ప్రభాస్ కు అక్క అంటే నమ్ముతారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook