Maredumilli forest: ఆంధ్రప్రదేశ్ మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మెగా హీరోల సందడి ప్రారంభమైంది. ఓ వైపు బన్నీ..మరోవైపు చెర్రీలు అడవుల బాట పట్టారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


టాలీవుడ్ ( Tollywood ) స్టైలిష్‌స్టార్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్ ( Allu Arjun ) నటిస్తున్న పుష్ప ప్రస్తుతం షూటింగ్‌లో ఉంది.  మారేడుమిల్లి అటవీ ప్రాంతంలోనే గత ఏడాది తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న బన్ని..ఇప్పుడు జనవరి 8 నుంచి మరో షెడ్యూల్ ప్లాన్ చేశాడు. ఫిబ్రవరి నుం‌చి మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi ) తో పాటు తనయుడు రామ్‌చరణ్ ( Ramcharan ) అలియాస్ చెర్రీలు నక్సలైట్‌లుగా  మారేడుమిల్లి అడవుల్లో తిరగనున్నారు. 


చిరంజీవి ప్రధాన పాత్రలో కొరటాల శివ ( Koratala siva ) తెరకెక్కిస్తున్న చిత్రం ఆచార్య. ఈ సినిమాలో రామ్‌చరణ్ ముఖ్యపాత్రలో కన్పించబోతున్నాడు. ఈ సినిమాలో ఇద్దరు హీరోలు నక్సలైట్లుగా కన్పించనున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్ సీన్స్‌ను ఫిబ్రవరి నెలలో మారేడుమిల్లి అడవుల్లో ( Maredumilli forest ) చిత్రీకరించనున్నారు. ఇప్పటికే బన్నీ కూడా ఇదే ఫారెస్ట్‌లో ప్లాన్ చేశాడు. మొత్తాన్ని మెగా హీరోలతో మారేడుమిల్లి అటవీప్రాంతం సందడిగా మారనుంది. కాజల్ అగర్వాల్ ( Kajal Aggarwal ) కథానాయికగా..సామాజిక నేపధ్యంలో చిత్రం తెరకెక్కనుంది.


Also read: మరో పెళ్లి చేసుకున్న రాఘవేంద్ర రావు మాజీ కోడలు Kanika Dhillon


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook