Acharya Movie Review: మచ్ ఎవైటెడ్ మూవీగా, భారీ అంచనాలతో మెగాస్టార్ చిరు ఆచార్య ఇవాళ విడుదల కానుంది. విడుదల సందర్భంగా సినిమాపై వస్తున్న రివ్యూలు ట్రెండ్ అవుతున్నాయి. 2.5 నుంచి 4- 4.5 వరకూ రేటింగ్ ఇస్తున్న పరిస్తితి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్ కలిసి సంయుక్తంగా నటిస్తున్న ఆచార్య సినిమా విడుదలవుతోంది. ఎప్పట్నించో ఊరిస్తున్న ఈ సినిమా విడుదల ఆలస్యమయ్యే కొద్దీ అంచనాలు పెంచుకుంది. భారీ అంచనాల మధ్య ఇవాళ ఏప్రిల్ 29న విడుదలవుతున్న ఆచార్య సినిమా ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. సామాజిక మాద్యమాల్లో మీమ్స్ వైరల్ అవుతున్నాయి. అదే సమయంలో సినిమాపై రివ్యూలు అదగరగొడుతున్నాయి. 4 నుంచ 4.5 వరకూ రేటింగ్ ఇచ్చేస్తున్నారు. ఫ్యాన్స్ కావచ్చు లేదా విమర్శకులు కావచ్చు రివ్యూ ఎవరిస్తున్నా..ట్రెండింగ్‌గా మారుతోంది. ఆచార్యపై అంతటి అంచనాలున్నాయి.


కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా తొలిరోజే 25 కోట్లు వసూలు చేస్తుందని అంచనా. సినిమా బడ్జెట్ 140 కోట్లు. తండ్రీకొడుకులు కలిసి సినిమా మొత్తం ఒకే స్క్రీన్ పంచుకోవడం ఇదే తొలిసారి. ఆచార్య సినిమా ఇప్పటికే 130 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ పూర్తయింది. ట్విట్టర్ లో సినిమాపై రివ్యూలు ఇలా వస్తున్నాయి. సినిమా తొలిభాగం డీసెంట్‌గా ఉండి సాధారణంగా ఉంటుందని చెబుతున్నారు. రెండవ భాగంలో తొలి 40 నిమిషాలు పూర్తిగా అభిమానుల్ని వెర్రెక్కించే విధంగా మాస్ ఎలివేషన్స్, ఫైట్స్, బీజీఎం, పాటలతో అద్దిరిపోతుందని అంటున్నారు. సినిమా క్లైమాక్స్ చాలా ఎమోషనల్‌గా ఉంటూనే హిందూ మతంపై సందేశముంటుంది.



మరో రివ్యూలో తొలి భాగంలో పాటలు బాగున్నాయని..సినిమా కాస్త ల్యాగింగ్ ఉందని..అయితే ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుందని రాశారు. ఇక సెకండ్ హాఫ్ రామ్‌చరణ్ ఫైట్స్, పాటలతో అదరగొట్టాడని..దర్శకత్వం బాగుందని రాశారు. సినిమా యావరేజ్ అని 2.5 రేటింగ్ మాత్రమే ఇచ్చారు.



ఆచార్య చిత్రంలో పాజిటివ్‌గా చెప్పుకోవాల్సింది చరణ్, చిరంజీవి పాత్రల గురించేనని..మిగిలినవి బలహీనంగా ఉన్నాయని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ చాలా పూర్ గా ఉందంటున్నారు. కధ విషయంలో నేరేషన్ బాగుందని..కొందరు, బాగాలేదని మరికొందరు చెబుతున్నారు. కొరటాల శివ మాత్రం తొలిసారిగా నిరాశపరిచారంటున్నారు.



Also read: Acharya Pre release Business : ఆచార్య మూవీ ప్రి రిలీజ్ బిజినెస్.. తొలి రోజు అంచనాలు ఎంతంటే..


రాంచరణ్, చిరంజీవి కలిసి నటించిన చిత్రం ఇలా అవుతుందని ఊహించలేం. ఇది కొరటాల శివ చిత్రమేనా అని నమ్మలేని విధంగా ఆచార్య ఉంది. పరిస్థితులు అనుకూలిస్తే తప్ప ఆచార్య.. బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకోవడం కష్టమని కూడా చెబుతున్నారు. కొరటాల శివ నుంచి ఇలాంటి సినిమా ఊహించలేదంటున్నారు ఇంకొందరు. నికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.