Chiranjeevi Jawan dance video: చిరంజీవి సినిమాల నుంచి పాలిటిక్స్ లోకి వెళ్లి ఆ తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి ఆయన రేంజ్ హిట్ అయితే రాలేదు. అందులో ఆయన రొటీన్ కథలు లేదా రీమిక్ సినిమాలు ఎంచుకోవడంతో తెగ బాధ పడిపోయారు చిరంజీవి అభిమానులు. నిజంగా చెప్పాలి అంటే చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చాక కలెక్షన్స్ పరంగా దూసుకుపోయింది కేవలం వాల్తేరు వీరయ్య సినిమా మాత్రమే. కానీ ఆ సినిమా కథ కూడా చాలా రొటీన్ కథే. కేవలం చిరంజీవి కామెడీ.. అందులో పండగ సీజన్ రిలీజ్ కావడంతో ఆ సినిమా కలెక్షన్స్ పరంగా సూపర్ అనిపించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాగా ఇప్పటివరకు ఈ మధ్య వచ్చిన ఏ చిరంజీవి చిత్రం కూడా అభిమానులకు వందశాతం ఉత్సాహపరచలేదు అనే చెప్పాలి. ఒకపక్క ఆయన వయస్సు హీరోలు అయినా రజినీకాంత్, కమల్ హాసన్, బాలకృష్ణ సూపర్ హిట్లతో దూసుకుపోతూ ఉంటే.. చిరంజీవి మాత్రం రొటీన్ కథలతో ఢీల పడిపోయాడు. ముఖ్యంగా ఆయన ఆచార్యా సినిమా డిజాస్టర్ గా మిగిలింది. కాగా అప్పుడు తప్పు మొత్తం దర్శకుడు పైనే వేసినట్టు చిరంజీవి చేసిన కొన్ని వ్యాఖ్యలు అప్పట్లో వైరల్ అయ్యాయి. కొరటాల శివాకి కూడా అప్పుడు దాకా ఫ్లాక్కులు లేవు కేవలం ఆచార్య మాత్రమే ఆయన కెరియర్ లో ఫ్లాప్. అందుకే కొంతమంది చిరంజీవిదే తప్పు అనగా మరి కొంతమంది దర్శకుడు తప్పు అంటూ వాదిచ్చుకున్నాడు.


మొత్తానికి కొరటాల విషయం పక్కనబెడితే మాత్రం మిగతా దర్శకులు కూడా చిరంజీవిని వంద శాతం ఉపయోగించుకోవట్లేదని ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న ఒక వీడియో చూస్తే అర్థమవుతుంది.



ఇటీవల చిరంజీవి ఇంట దివాళీ బ్యాష్ జరిగిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సెలబ్రేషన్స్ లో ఇండస్ట్రీలోని టాప్ స్టార్స్ అంతా హాజరయ్యి సందడి చేశారు. ఈక్రమంలోనే తాజాగా ఒక వీడియో బయటకి వచ్చింది. కాగా ఆ వీడియోలో చిరంజీవి షారుఖ్ ఖాన్ రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ జవాన్ టైటిల్ ట్రాక్ కి తనదైన గ్రేస్ తో అదిరే స్టెప్పులు వేస్తూ కనిపించారు. మెగాస్టార్ డాన్స్ వేస్తుంటే ఈ వయసులో కూడా మన మెగాస్టార్ స్టైల్, గ్రేస్ ఏమాత్రం తగ్గలేదని అర్థమవుతుంది. 


అందుకే ఈ వీడియో చూస్తే చిరంజీవి అభిమానులకు తప్పకుండా దర్శకులే మన మెగాస్టార్ టాలెంటుని పూర్తిగా వాడుకోవడం లేదు అని అనిపించక మానదు. 
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  మరి ఈ వీడియో చూసిన ఎవరైనా దర్శకుడు చిరంజీవికి సరైన కథతో వచ్చి బ్లాక్ బస్టర్ అందిస్తారేమో చూడాలి.


Also Read: Unknown Facts About Chandra Mohan: చంద్రమోహన్ గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..ఆయనకు గుర్తింపు తెచ్చిన సినిమా ఇవే! 


Also Read:  Delhi Air Pollution: ఢిల్లీపై కరుణించిన ప్రకృతి, వర్షం కారణంగా పెరిగిన గాలి నాణ్యత


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.TwitterFacebook