Megastar Chiranjeevi praises Dasara: నాని హీరోగా నటించిన దసరా సినిమా శ్రీరామనవమి సందర్భంగా మార్చి 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాని కెరియర్ లోనే మొట్టమొదటి ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు సహా తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సైతం రిలీజ్ అయింది. అయితే నాని సినిమా మిగతా భాషల్లో ఊహించిన మేర ఫలితాలు అందుకో లేకపోయినా తెలుగులో మాత్రం 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టి నాని కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలిచింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటించగా  నాని స్నేహితుడి పాత్రలో కన్నడ హీరో దీక్షిత్ శెట్టి నటించాడు. విలన్ గా మలయాళ స్టార్ షైన్ చాం టాకో నటించిన ఈ సినిమాకి మొదటి ఆట నుంచి మిశ్రమ స్పందన లభించింది. అయితే తెలుగులో మాత్రం కలెక్షన్స్ విషయంలో దూసుకుపోతోంది.


ఇది కూడా చదవండి: Rakul Preet Photos: బ్లాక్ బాడీ కాన్ డ్రెస్సులో పాలరాతి శిల్పంలా మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్..తట్టుకోవడం కష్టమే సుమీ!


ఇప్పటికే ఈ సినిమా చూసి ప్రభాస్, రాజమౌళి, మహేష్ బాబు వంటి వారు ప్రశంసలు కురిపించగా ఇప్పుడు టాలీవుడ్ మొత్తానికి పెద్దదిక్కుగా చెబుతున్న మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రశంసల వర్షం కురిపించారు. నాని పేరుతో ఒక ట్వీట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి డియర్ నాని కంగ్రాట్యులేషన్స్ దసరా చూశాను, భలే అనిపించింది నువ్వు నీ మేకోవర్తో పర్ఫామెన్స్ తో సినిమా మొత్తాన్ని నడిపించావు, ఇది డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలకు మొదటి సినిమా అని తెలుసుకుని చాలా ఆశ్చర్యపోయాను, ఆయన అద్భుతమైన క్రాఫ్ట్ మెన్ షిప్ ని అభినందిస్తున్నాను ఇక మన మహానటి కీర్తి సురేష్ నటన జస్ట్ వావ్ అనిపించింది.



దీక్షిత్ శెట్టి కూడా తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు, సంతోష్ నారాయణన్ సంగీతం రాక్ చేసింది. దసరా సినిమా యూనిట్ మొత్తానికి నా అభినందనలు అంటూ మెగాస్టార్ చిరంజీవి ఒక ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ కి దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఆసక్తికరంగా రీట్వీట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి సిగ్నేచర్ స్టెప్ అయిన ఇంద్ర సినిమాలోని వీణ స్టెప్ వేస్తున్నట్టుగా ఉన్న తన చిన్నప్పటి ఫోటోలు షేర్ చేసి ఎగురుతున్నా, థాంక్యూ బాస్ అంటూ శ్రీకాంత్ ఓదెల కామెంట్ చేశాడు. అంటే మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలతో తాను గాల్లో తేలిపోతున్నానని అర్థం వచ్చేలా శ్రీకాంత్ ఓదెల ట్వీట్ చేశారన్న మాట. 


ఇది కూడా చదవండి: Balagam Hero House: ఇల్లు షూటింగ్ కి ఇస్తే థాంక్స్ కూడా చెప్పలేదు.. వేణుపై ఇంటి ఓనర్ షాకింగ్ కామెంట్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook