Megastar Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఏపీ ప్రభుత్వం (AP Govt) గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ థియేటర్లలో సినిమా టికెట్ల ధరలను (Cinema Tickets Rates) పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఒక్కో ప్రాంతంలో థియేటర్లను నాలుగు కేటగిరీలుగా విభజించిన జగన్ సర్కార్.. మున్సిపల్ కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలోని థియేటర్లకు వేర్వేరు ధరలను ఫిక్స్ చేసింది. కనీస టికెట్ ధరను రూ.20గా, గరిష్ట టికెట్ ధరను రూ.250గా నిర్ణయించింది. ఏసీ, నాన్ ఏసీ, మల్టీప్లెక్స్‌ అన్న తేడా లేకుండా ప్రతీ థియేటర్‌లో నాన్ ప్రీమియం కేటగిరి కింద 25 శాతం సీట్లు కేటాయించాలని జీవోలో తెలిపింది. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. కొత్త జీవో జారీ చేసినందుకు ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


''తెలుగు సినిమా పరిశ్రమకు మేలు కలిగే విధంగా.. అటు థియేటర్ల మనుగడను.. ప్రజలకు వినోదం అందుబాటులో ఉండాలనే సంకల్పాన్ని దృష్టిలో పెట్టుకుని సినిమా టికేట్స్ రేట్స్ సవరిస్తూ సరికొత్త జీవో జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారికి. పరిశ్రమ తరపున కృతజ్ఞతలు. చిన్న సినిమాకు ఐదవ షో అవకాశం కల్పించడం ఎందరో నిర్మాతలకు ఉపయోగపడే అంశం. సంబంధిత మంత్రివర్యులు.. పేర్ని నాని గారికి, అధికారులకు, కమిటీకి ధన్యవాదాలు'' అంటూ చిరంజీవి (Megastar Chiranjeevi) ట్వీట్ లో పేర్కొన్నారు. 


Also Read: AP Movie Ticket Price: సినీ ఇండస్ట్రీకి గుడ్ న్యూస్... సినిమా టికెట్ల ధరలు పెంచిన ఏపీ సర్కార్..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి