Romantic movie pre-release event: పూరీ జగన్నాథ్ వారసుడు ఆకాష్ పూరీ హీరోగా నటించిన 'రొమాంటిక్' మూవీ ప్రి రిలీజ్ ఫంక్షన్‌కి హీరో విజయ్ దేవరకొండ, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇవాళ సాయంత్రం వరంగల్‌లో జరిగిన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. హీరో విజయ్ దేవరకొండ తమ ఫ్యామిలీ మెంబర్ లాంటి వాడేనని అన్నారు. విజయ్ దేవరకొండ (Errabelli Dayakar Rao, vijay Deverakonda) ఎప్పుడు వరంగల్ వచ్చినా అప్పుడు తమ ఇంటికి వస్తాడని తెలిపారు. గతంలోనూ రెండుసార్లు మా ఇంటికి వచ్చిన విజయ్ దేవరకొండ.. ఇవాళ కూడా వచ్చాడని అన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా రొమాంటిక్ మూవీ గురించి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. ఈ చిత్రం హీరో ఆకాష్ పూరీ ఈ సినిమాతో తప్పకుండా సక్సెస్ అందుకుంటాడని ఆకాంక్షించారు. సినిమాలు డైరెక్ట్ చేయడంలో సిద్ధహస్తుడైన పూరీ జగన్నాథ్ (Director Puri Jagannadh) ఇకపై ఏ సినిమా తీసినా వరంగల్ నుంచే ప్రారంభించాలని మంత్రి ఎర్రబెల్లి విజ్ఞప్తి చేశారు. 


Also read: Jai Bhim Movie Trailer: సూర్య 'జై భీమ్​' ట్రైలర్​ వచ్చేసింది!


హైదరాబాద్ తర్వాత సినిమాల షూటింగులకు వరంగల్ బెస్ట్ ఛాయిస్ కావాలని మంత్రి ఎర్రబెల్లి ఆశాభావం వ్యక్తంచేశారు. వరంగల్ ఒకప్పటిలా లేదని... కాకతీయుల కాలం నాటి కట్టడాలకు మళ్లీ పునర్వైభవం తీసుకొచ్చామని అన్నారు. రామప్ప టెంపుల్ (Ramappa temple), లక్నవరం చెరువు, వేయి స్తంభాల గుడి.. ఇలా అనేకమైన అందమైన ప్రదేశాలు వరంగల్‌లో (Warangal tourist places) ఉన్నాయని.. సినిమా వాళ్లకు గుర్తుచేశారు. 


వరంగల్ నుంచి ఏ పని మొదలుపెట్టినా అది తప్పకుండా విజయవంతం అవుతుందని చెబుతూ.. భద్రకాళి అమ్మ వారి ఆశీస్సులతో ఆకాశ్ పూరి హీరోగా వస్తున్న రొమాంటిక్ మూవీ (Akash Puri's Romantic movie) కూడా కచ్చితంగా విజయం సాధిస్తుందని అన్నారు.


Also read : Prabhas New Look: రాధేశ్యామ్ నుండి ప్రభాస్ న్యూ లుక్.. లీకైన రాధేశ్యామ్ టీజర్ పిక్స్


Also read : Varudu Kavalenu trailer: ఆకట్టుకుంటున్న వరుడు కావలెను ట్రైలర్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook