Akash Puri’s Romantic: 'రొమాంటిక్' ట్రైలర్...మామూలుగా లేదుగా..!

Akash Puri’s Romantic: పూరీజగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి తాజాగా నటిస్తున్న చిత్రం 'రొమాంటిక్'. ఈ సినిమా ట్రైలర్ ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇవాళ రిలీజ్ చేశారు.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 19, 2021, 04:39 PM IST
Akash Puri’s Romantic: 'రొమాంటిక్' ట్రైలర్...మామూలుగా లేదుగా..!

Romantic Movie: యంగ్ హీరో ఆకాష్ పూరి(Akash Puri) నటిస్తున్న తాజా చిత్రం రొమాంటిక్. ఈ సినిమాకు పూరి శిష్యుడు అనిల్ పాదూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అలాగే కథ – స్క్రీన్ ప్లే – డైలాగ్స్ పూరిజగన్నాథ్(Puri Jagannadh) అందించారు. ఇక ఆకాశ్ సరసన కేతిక శర్మ(Ketika Sharma) హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.ఈ చిత్రంలో రమ్యకృష్ణ(Actress Ramya Krishna) పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు.

Also Read: Manchu Manoj vs RGV: మా ఎన్నికలపై ఆర్జీవీ ట్వీట్‌కు దీటైన కౌంటర్ ఇచ్చిన మంచు మనోజ్

తాజాగా  ఈ సినిమా ట్రైలర్(Romantic Trailer) ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) లాంచ్ చేశారు. అనంతరం చిత్రయూనిట్ కు డార్లింగ్ విషెస్ చెప్పారు. ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమా ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని అనిపిస్తుంది. అందమైన ప్రేమకథగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు చిత్రయూనిట్. దీపావళి కానుకగా అక్టోబర్ 29న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను థియేట్రికల్ రిలీజ్ చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. రెండేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమాకు దీపావళికి మోక్షం కలగనుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x