Harnaz Kaur Sandhu: షాకింగ్ విషయం బయటపెట్టిన మిస్ యూనివర్స్... ఆమెకు అరుదైన వ్యాధి...
Harnaz Sandhu suffers from Celiac Disease: మిస్ యూనివర్స్ హర్నాజ్ కౌర్ సంధు సంచలన విషయాన్ని వెల్లడించింది. తాను ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపింది. అందుకే బరువు పెరిగినట్లు పేర్కొంది.
Harnaz Sandhu suffering from Celiac Disease: మిస్ యూనివర్స్ హర్నాజ్ కౌర్ సంధు సంచలన విషయాన్ని వెల్లడించింది. తాను సెలియాక్ డిసీజ్‌తో బాధపడుతున్నట్లు తెలిపింది. అందుకే బరువు పెరిగినట్లు పేర్కొంది. ఇటీవల లాక్మే ఫౌండేషన్ ఫ్యాషన్ షోలో మెరిసిన హర్నాజ్ సంధుపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. సంధు బాగా బరువు పెరిగిపోయిందని... 'ఆమె ప్లస్ సైజ్ మోడల్' అని నెటిజన్లు ట్రోల్ చేశారు.
ట్రోల్స్‌పై స్పందించిన సంధు... తాను బరువు పెరగడానికి కారణం సెలియాక్ డిసీజ్ అని వెల్లడించింది. ఈ విషయం ఇప్పటివరకూ ఎవరికీ తెలియదని పేర్కొంది. డిసీజ్ కారణంగానే తానెంతగా ప్రయత్నించినా మళ్లీ లావెక్కుతున్నట్లు తెలిపింది. చంఢీగఢ్‌లో ఓ ఈవెంట్‌లో పాల్గొన్న సందర్భంగా హర్నాజ్ సంధు ఈ విషయాన్ని బయటపెట్టింది. లావుగా ఉన్నా.. సన్నగా ఉన్నా.. తాను చాలా ఆత్మవిశ్వాసం, ధైర్యం కలిగిన అమ్మాయిని అని సంధు పేర్కొంది. తన బాడీని తాను ప్రేమిస్తానని తెలిపింది.
సెలియాక్ డిసీజ్ అంటే ఏంటి :
మనం తీసుకునే ఆహారంలో ఉండే 'గ్లుటెన్' ప్రోటీన్ చిన్న ప్రేగుపై ప్రభావం చూపిస్తుంది. దాని కారణంగా సెలియాక్ డిసీజ్ బారినపడే అవకాశం ఉంటుంది.
సెలియాక్ డిసీజ్‌తో బాధపడేవారికి శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ అందవు. దీంతో అనిమీయా, ఎముకల బలహీనత వంటి ఆరోగ్య సమస్యలు రావొచ్చు. ఈ డిసీజ్‌తో బాధపడేవారు ఆహారంలో 'గ్లుటెన్' లేకుండా చూసుకోవాలి. ఇప్పటికైతే ఈ వ్యాధికి నివారణ లేదు. డైట్‌ను నియంత్రణలో పెట్టుకోవడం ద్వారా ఈ వ్యాధిని నియంత్రణలో ఉంచవచ్చు.
Also Read: Rashmika Mandanna: ఊహించని షాక్.. రష్మికను సైడ్ చేసిన విజయ్?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook