Mistakes in God Father: చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో ఈ తప్పులని మీరు గమనించారా?
Mistakes in Megastar Chiranjeevi God Father Movie: గాడ్ ఫాదర్ సినిమాలో కొన్ని లాజిక్స్ కు అందని విషయాలు ఉన్నాయి. ఆ సీన్లు ఏమిటి? మిస్సయిన ఈ లాజిక్స్ ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే
Mistakes in Megastar Chiranjeevi God Father Movie: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ దక్కించుకుంటుంది. అక్టోబర్ 5వ తేదీన దసరా సందర్భంగా తెలుగు హిందీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమాని మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ అనే సినిమాకి తెలుగు రీమేక్ గా రూపొందించారు. మలయాళంలో మోహన్ లాల్ పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
పూర్తిగా మక్కికి మక్కి సినిమాని దించేయకుండా కొన్ని మార్పులు చేర్పులు అయితే చేసినట్లు సినిమా చూసిన వారు కామెంట్ చేస్తున్నారు. అయితే సినిమా టాక్ బాగానే ఉన్నా కలెక్షన్స్ విషయంలో మాత్రం కాస్త వెనకబడినట్లుగా చెబుతున్నారు. అయితే ఇప్పుడు కాస్త పుంజుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ రోజు ఆదివారం కావడంతో కలెక్షన్స్ మరికొంత పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలో కొన్ని లాజిక్స్ మిస్ అయ్యాయి అనే విషయం ఇప్పుడు తాజాగా తెర మీదకు వచ్చింది.
సినిమా చూస్తున్నంత సేపు ఈ విషయాన్ని ప్రేక్షకులు గమనించలేదు కానీ సినిమా పూర్తి అయిన తర్వాత ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారా అనే ఆసక్తి కలుగుతుంది. ఈ సినిమా మొత్తం కూడా ఒక ముఖ్యమంత్రి చనిపోతే తరువాత ముఖ్యమంత్రి ఎవరు? అనే అంశం చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. కానీ వాస్తవానికి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చనిపోతే గవర్నర్ వెంటనే ఆపధర్మ ముఖ్యమంత్రిని నియమిస్తారు. కానీ ఈ సినిమాలో అలా ఆపధర్మ ముఖ్యమంత్రిగా ఎవరిని నియమించిన దాఖలాలు కనిపించవు.
దానికి తోడు ఎవరికి వారు ముఖ్యమంత్రి కావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు చూపిస్తారు అది కూడా రోజుల తరబడి సాగుతూ ఉంటుంది. ఇలా రోజుల తరబడి ముఖ్యమంత్రి కానీ ఆపధర్మ ముఖ్యమంత్రి కానీ లేకుండా రాష్ట్రాల పాలన అయితే జరగదు. ఈ లాజిక్ మేకర్స్ ఎలా మిస్ అయ్యారా అని చర్చ జరుగుతుంది. కానీ వాస్తవానికి లూసిఫర్ సినిమాలో కూడా ఈ లాజిక్ ను ప్రేక్షకులు అంతగా పట్టించుకోలేదు. బహుశా అందువల్లే తెలుగు గాడ్ ఫాదర్ మేకర్స్ కూడా ఈ విషయాన్ని పెద్దగా దృష్టిలోకి తీసుకుని ఉండి ఉండకపోవచ్చు. అలాగే సినిమాలో మెగాస్టార్ చిరంజీవిని ఒక తప్పుడు ఆరోపణతో అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. అయితే ఏదైనా కేసులో అరెస్టు చేసి వెంటనే జైలుకు ఖైదీగా పంపించడం అనేది ఉండదు. ముందుగా రిమాండ్ ఖైదీగా లోపలికి పంపించి కేసు విచారణ పూర్తయిన తర్వాతే పూర్తిస్థాయి జడ్జిమెంట్ బయటకు వస్తుంది.
ఈ సినిమాలో కూడా ఒక రకంగా మెగాస్టార్ చిరంజీవి రిమాండ్ ఖైదీగానే లోపలికి వెళ్లినట్లుగా చెప్పాలి. కానీ రిమాండ్ ఖైదీలకు వాస్తవానికి జైలు నెంబర్ ప్రొవైడ్ చేయరు. జైలు శిక్ష ఖరారు అయిన తర్వాత మాత్రమే జైలు అధికారులు ఖైదీలకు నెంబర్లు ఇస్తారు. కానీ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి 786 నెంబర్ ఇచ్చినట్లు చూపిస్తారు. బహుశా ఖైదీ సినిమాలో కూడా ఆ నెంబర్ మెగాస్టార్ చిరంజీవికి కలిసి వచ్చింది కాబట్టి దాన్ని ఇక్కడ వాడి ఉండవచ్చు అనే అంచనాలు ఉన్నాయి. మరో విషయం ఏమిటంటే అధికారంలో ఉన్న ఒక పార్టీకి ఫండ్ కావాలి అంటే అనేక మంది వ్యాపారవేత్తలు క్యూలో నిలబడి మరీ ఫండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు.
గాడ్ ఫాదర్ సినిమాలో సత్యదేవ్ పార్టీ ఫండ్ కోసం ఒక డ్రగ్ డీలర్ ను సంప్రదించడం, నెలకు 750 కోట్ల రూపాయల కోసం డ్రగ్స్ విచ్చలవిడిగా మా రాష్ట్రంలో దిగుమతి చేసుకొని మీకు కావాల్సిన రాష్ట్రాలకు తీసుకువెళ్లి అమ్ముకోమని ఆఫర్ ఇవ్వడం అనేది కాస్త వాస్తవికతకు దూరంగా ఉంటుంది. ఎందుకంటే ఎంత పోలీస్ యంత్రాంగం, మీడియా యంత్రాంగం మద్దతు పలికినా ఎక్కడో ఒకచోట ఈ విషయం లీకవ్వడం ప్రభుత్వానికి మాయని మచ్చగా నిలవడం వంటి విషయాలు జరుగుతాయి. ఆ భయంతో ఎవరు ఇలాంటి స్టెప్ తీసుకోరు కానీ సినిమాలో మాత్రం అందుకు విరుద్ధంగా డ్రగ్స్ అమ్ముకోవడానికి లైసెన్స్ ఇచ్చేయడానికి సిద్ధమైనట్లుగా చూపించడం దూరంగా ఉంది.
Also Read: Godfather Day 4 Collections: ఊపందుకున్న గాడ్ ఫాదర్.. మూడో రోజు కంటే పెరిగిన వసూళ్లు.. ఎన్ని కోట్లంటే?
Also Read: Adah Sharma Hot Photos: ఆదా శర్మ హాట్ ట్రీట్.. ఎద అందాలు ఆరబోస్తూ వలపు వల!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook