Godfather Day 4 Collections: ఊపందుకున్న గాడ్ ఫాదర్.. మూడో రోజు కంటే పెరిగిన వసూళ్లు.. ఎన్ని కోట్లంటే?

Godfather box office collection Day 4 World Wide: గాడ్ ఫాదర్ సినిమాకు మంచి టాక్ వస్తున్నా వసూళ్ల విషయంలో కాస్త వెనుక పడుతోంది. అయితే ఇప్పుడు వసూళ్లు నెమ్మదిగా పెరుగుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే

Written by - Chaganti Bhargav | Last Updated : Oct 9, 2022, 12:41 PM IST
Godfather Day 4 Collections: ఊపందుకున్న గాడ్ ఫాదర్.. మూడో రోజు కంటే పెరిగిన వసూళ్లు.. ఎన్ని కోట్లంటే?

Godfather box office collection Day 4 World Wide : మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా అక్టోబర్ 5వ తేదీన దసరా సందర్భంగా తెలుగు సహా హిందీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.  ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ ఒక కీలక పాత్రలో నటించడంతో తెలుగుతో పాటు హిందీలో కూడా విడుదల చేశారు ఇక ఈ సినిమాకు కలెక్షన్లు రోజురోజుకు పెరుగుతున్నాయి. హిందీలో ఏకంగా 600 స్క్రీన్స్ కూడా పెంచారంటే ఈ సినిమాకు నార్త్ లో ఎలాంటి క్రేజ్ లభిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

మోహన్ రాజా డైరెక్ట్ చేసిన ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ల మీద ఎన్వి ప్రసాద్, ఆర్బి చౌదరి సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ చిరంజీవితో పాటు నయనతార, సత్యదేవ్, సముద్రఖని, సునీల్, అనసూయ, దివి వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమా పాజిటివ్ టాక్ మొదటి ఆట నుంచి తెచ్చుకుంటున్నా, కలెక్షన్స్ విషయంలో మాత్రం కాస్త వెనక పడుతుందని అంచనాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా కలెక్షన్స్ పెరుగుతూ వెళ్లడం ఆసక్తికరంగా మారింది.

తాజాగా నాలుగో రోజు అంటే శనివారం నాడు వసూళ్లు శుక్రవారం నాటి వసూళ్ల కంటే కాస్త పెరిగాయి. మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 13 కోట్ల దాకా వసూళ్లు రాబడితే రెండవ రోజు 8 కోట్ల దాకా వసూళ్లు రాబట్టింది మూడో రోజు 5:30 కోట్ల దాకా వసూళ్లు వస్తే నాలుగో రోజు 5 కోట్ల 70 లక్షల దాకా వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు. మొత్తం నాలుగు రోజులకు కలిపి 31 కోట్ల 73 లక్షల రూపాయలు తెలుగు రాష్ట్రాల్లో షేర్ వసూలు రాబట్టి ఈ సినిమా 52 కోట్ల 70 లక్షల గ్రాస్ వసూళ్లను అందుకోగలిగింది.

ఇక ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ సినిమా మంచి రెస్పాన్స్ దక్కించుకుంటుంది. కాకపోతే దుబాయ్, యునైటెడ్ కింగ్ వంటి కొన్ని దేశాల్లో విడుదల చేయకపోవడంతో కాస్త కలెక్షన్స్ విషయంలో మాత్రం డ్రాప్ కనిపిస్తోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 42 కోట్ల 43 లక్షల రూపాయలు షేర్ వసూళ్లు రాబడితే 72 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇక మాకు అందిన వివరాలు మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాం.
 
మూడో రోజు కలెక్షన్స్
నైజాం : 1.93 కోట్లు
సీడెడ్ : 1.08 కోట్లు
ఉత్తరాంధ్ర: 91 లక్షలు 
ఈస్ట్ గోదావరి: 36 లక్షలు 
వెస్ట్ గోదావరి: 27 లక్షలు 
గుంటూరు: 42 లక్షలు 
కృష్ణ: 35 లక్షలు 
నెల్లూరు: 30 లక్షలు 
ఏపీ- తెలంగాణలో కలిపి :- 5.62 కోట్లు షేర్ (9.20 కోట్లు గ్రాస్)
 
మూడు రోజులకు కలిపి 

నైజాం : 9.28 కోట్లు
సీడెడ్ : 7.35 కోట్లు
ఉత్తరాంధ్ర: 4.07 కోట్లు 
ఈస్ట్ గోదావరి: 2.89 కోట్లు
వెస్ట్ గోదావరి: 1.60 కోట్లు
గుంటూరు: 3.15 కోట్లు
కృష్ణ: 1.93 కోట్లు
నెల్లూరు: 1.46 కోట్లు
ఏపీ- తెలంగాణలో కలిపి :- 31.73 కోట్లు షేర్ (52.70 కోట్లు గ్రాస్)
కర్ణాటక- 3.15 కోట్లు 
హిందీ సహా ఇండియా మొత్తం తెలుగు వర్షన్ – 3.75 కోట్లు
ఓవర్ సీస్ – 3.80 కోట్లు 
ప్రపంచవ్యాప్తంగా – 42.43 కోట్ల షేర్ (77.20 కోట్ల గ్రాస్) 

నోట్: ఇక జీ తెలుగు అందిస్తున్న ఈ సమాచారం వివిధ మాధ్యమాల నుంచి సేకరించింది. ఈ సమాచారాన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.
Also Read: Nagarjuna - Mohan Raja: గాడ్ ఫాదర్ డైరెక్టర్ తో ఘోస్ట్.. ముందే లైన్లో పెట్టారు కానీ?

Also Read: Aarnav - Divya: నాది వివాహేతర సంబంధం కాదు.. నా భార్యకు అతనితో గర్భం.. ఆర్నవ్ సంచలనం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News