మేల్ డామినేషన్ గురించి `ఎంఎల్ఏ` హీరోయిన్ ఏం చెప్పింది ?
లక్ష్మీ కల్యాణం సినిమా తర్వాత దాదాపు 11 ఏళ్లకు మళ్లీ కల్యాణ్‌రామ్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ఎంఎల్ఏ సినిమా ఇవాళే ఆడియెన్స్ ముందుకొచ్చిన నేపథ్యంలో ఎంఎల్ఏ హీరోయిన్ కాజల్ మీడియాతో పంచుకున్న పలు ఆసక్తికరమైన అంశాలు ఇలా వున్నాయి.
కళ్యాణ్‌రామ్ ప్రధాన పాత్రలో నటించిన M.L.A. సినిమా ఈ రోజే గ్రాండ్‌గా ఆడియెన్స్ ముందుకొచ్చింది. ఫస్ట్ షోతోనే టాలీవుడ్‌లో పాజిటివ్ వైబ్‌ని క్రియేట్ చేస్తున్న ఈ సినిమా గురించి ఎంఎల్ఏ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పలు ఆసక్తికరమైన సంగతులు మీడియాతో పంచుకుంది. కాజల్ చెప్పిన ఆ ఆసక్తికరమైన అంశాలు ఇక్కడ మీ కోసం.
భిన్నంగా అనిపించింది…
కళ్యాణ్ రామ్‌తో పని చేసి పదేళ్లు అవుతోంది. ఈ పదేళ్ళలో చాలా మారిపోయింది. అయినా మా మధ్య వుండే కంఫర్ట్ లెవెల్స్ ఏ మాత్రం మారలేదు. షూటింగ్ మధ్యలో తేజ గారి గురించి మాట్లాడుకున్నాం. చేసే ప్రతి సన్నివేశాన్ని చర్చించుకుంటూ మరీ చేశాం.
ఆ తర్వాత అతడిని అస్సలే కలవలేదు…
లక్ష్మీ కళ్యాణం సినిమా తర్వాత నేను కళ్యాణ్ రామ్ అసలు కలుసుకోలేదు. నిజం చెప్పాలంటే ఇండస్ట్రీలో ఒకరితో ఒకరు టచ్‌లో ఉండేంత టైమ్ ఉండదు. ఒకసారి ఒక సినిమా కలిసి చేశామంటే, మళ్ళీ ఎవరికి వారు నెక్స్ట్ సినిమాలతో బిజీ అయిపోతారు. కానీ తప్పకుండా ఆ ఫ్రెండ్‌షిప్ మాత్రం అలాగే ఉంటుంది.
సీన్ ఇలా వుంటుందని నిజంగా అనుకోలేదు…
‘లక్ష్మీ కళ్యాణం’ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్‌తో సినిమా చేస్తానని అస్సలు అనుకోలేదు. నిజానికి నా ప్లాన్స్ ప్రకారం ఆ సినిమా తర్వాత నేను M.B.A. చేయాలి అనుకున్నాను. అప్పుడు నా ముందున్న లక్ష్యం కూడా అదే. సినిమాల గురించి ఆలోచన అస్సలే లేదు. కానీ తెలుగు ప్రజలు చూపిన ప్రేమ నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది. లైఫ్ లాంగ్ వారికి రుణపడి ఉంటాను.
అప్పటికి కాని అర్థం కాలేదు…
ఒకరకంగా చెప్పాలంటే సినిమా తర్వాత సినిమాలు చేస్తూ వచ్చాను కానీ, మగధీర సినిమా చేసేంత వరకు తెలీదు ఇక సినిమానే నా కెరియర్ అవుతుందని. మగధీర సినిమా తర్వాత నా కెరీర్ గురించి ఓ క్లారిటీ వచ్చింది. ఇక నా లైఫ్ ఇదే…
అదే నా క్యారెక్టర్…
ఈ సినిమాలో నేను ప్లే చేసిన క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. సినిమాలో ఇంటర్వెల్ పాయింట్ వరకు అసలు తనేం చేస్తుందీ..? ఎందుకు చేస్తుందీ అనేది సస్పెన్స్. ఈ సినిమాలో అలాంటి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయి.
మెసేజ్ ఉంటుంది కానీ…
M.L.A ఒక మల్టీజానర్ సినిమా. సినిమాలో ఇన్‌డెప్త్‌గా మంచి మెసేజ్ ఉంటుంది. అలాగని బలవంతంగా అందరి నెత్తిపై రుద్దినట్టుగా ఉండదు. కమర్షియల్ వ్యాల్యూస్‌తో పాటు కంప్లీట్ ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది.
బ్యాలన్స్ కంపల్సరీ…
ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చేయాలని అందరూ అనుకుంటారు కానీ ఒక్కోసారి కెరియర్‌ని బ్యాలన్స్ చేసుకోవడం కూడా అంతే అవసరం. ఏదో ఈ రోజు జస్ట్ గ్లామరస్ రోల్స్ మాత్రమే చేయకూడదు అని చెబుతున్నాను కానీ, నేను చాలా సినిమాల్సో అలా కూడా నటించాను. ఇష్టపడి చేశాను. కానీ అవకాశం ఉన్నప్పుడు స్ట్రాంగ్ రోల్స్ ఎంచుకోవడం ఇంకా బావుంటుంది.
అలాంటి టార్గెట్స్ ఏమీ పెట్టుకోలేదు…
ఇన్ని సినిమాలు చేయాలి, ఈ హైట్స్‌కి చేరుకోవాలి అని నేను ఎప్పుడూ నేను ఎప్పుడూ అనుకోలేదు. సిన్సియర్‌గా మన పనిని మనం 100% చేయలనేదే నేను నమ్మే సూత్రం.
కళ్యాణ్ రామ్ గురించి…
వృత్తిపై చాలా ప్యాషన్ వున్న నటుడు. నిజాయితీగా ఉంటాడు. తన ఫ్యామిలీ గురించి.. పిల్లల గురించి.. ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాడు.
స్పెషల్ సాంగ్స్ గురించి నేనేమంటానంటే…
'జనతా గ్యారేజ్' సినిమా తర్వాత స్పెషల్ సాంగ్ చేయమని చాలా ఆఫర్స్ వచ్చాయి. స్పెషల్ అనిపించుకోవాలి అని నాకూ ఉంటుంది కానీ, రెగ్యులర్‌గా కాదు, జస్ట్ ఎప్పుడో ఒకసారి…
ఆ ఆలోచన నాదే….
గత 2, 3 ఏళ్లుగా డిఫెరెంట్ క్యారెక్టర్స్ చేయడానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నాను. అలా గతంలో చేయలేదా అంటే చేశాను కానీ, ఏదో రకంగా పాసిబుల్ అవలేదు. కానీ ఇప్పుడు డిఫెరెంట్ కాన్సెప్ట్స్ వింటున్నాను కాబట్టి, అందుకు తగిన విధంగా నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాను. అటు గ్లామర్‌కి ప్రాధాన్యత వుండే పాత్రలతో పాటు మరిన్ని విభిన్నమైన పాత్రలు చేస్తూ కెరియర్‌ని బ్యాలన్స్ చేసుకుంటున్నాను. శ్రీనివాస్ బెల్లంకొండతో ఓ వైపు కమర్షియల్ సినిమా చేస్తూనే మరో వైపు క్వీన్ రీమేక్‌లో నటిస్తున్నాను.
ఏదైనా సరే నచ్చితేనే…
బాలీవుడ్ సినిమా చేయాల్సి వస్తే, అందులో పాత్ర నచ్చితేనే చేస్తా. స్క్రిప్ట్ నచ్చితే ఏ భాషా చిత్రమైనా చేయడానికైనా రెడీ. కానీ జస్ట్ బాలీవుడ్ అనే ఫీలింగ్‌తో హిందీ సినిమా చేయను.
అలాంటి ఫీలింగ్ ఏమీ లేదు…
ఇండస్ట్రీలో చాలామంది కొత్త హీరోయిన్స్ వస్తున్నారు. ఇక్కడ ఎంతమందికైనా పనిచేయడానికైనా అవకాశం ఉంది. కొత్తవాళ్ళు వస్తున్నారన్న అభద్రతా భావానికి గురికావాల్సిన పని లేదు.
మేల్ డామినేషన్….
ఫిలిం ఇండస్ట్రీలో నాకు మేల్ డామినేషన్ ఎక్కడా కనిపించలేదు. ఇక్కడ అందరూ కలిసిమెలిసి పనిచేస్తారు. అవకాశం, అవసరం వచ్చినప్పుడు అందరం కలిసి అభిప్రాయాలు పంచుకుంటుంటాం. టీమ్ ఎఫర్ట్ కచ్చితంగా ఉంటుంది కానీ డామినేషన్ ఎక్కడా కనిపించదు.