Mohan Babu Clarity on Meeting Chandrababu: సినీ నటుడు మోహన్ బాబు తన కుమార్తె మంచు లక్ష్మితో కలిసి తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుని ఆయన నివాసంలో కలవడం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీతో కలిసి పని చేసిన మోహన్ బాబు తర్వాత పార్టీకి దూరమై బీజేపీ వాదన వినిపిస్తూ ఉండేవారు. అయితే తన కుమారుడు మంచు విష్ణు వైఎస్ తో బంధుత్వం కలుపుకున్న తర్వాత పూర్తిగా చంద్రబాబుకు దూరమయ్యారు. గత ఎన్నికల ముందు అయితే చంద్రబాబుకు వ్యతిరేకంగా పలు చోట్ల ప్రచారం కూడా నిర్వహించారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చాక రాజకీయంగా సైలెంట్ అయిన మోహన్ బాబు చంద్రబాబుతో భేటీ కావడమే కాక సుమారు రెండు గంటల పాటు చర్చలు జరిపినట్టు వార్తలు బయటకు రావడంతో అనేక ప్రచారాలు మొదలయ్యాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మోహన్ బాబు నటించిన సన్నాఫ్ ఇండియా సినిమా దారుణంగా విఫలం కావడం వెనుక ఆయన వైసీపీకి మద్దతు పలకడమే కారణం అని ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే ఆయన తన సినీ అవసరాల కోసం అలాగే తన కుమారుడి సినీ భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడుని కలిశారని ఊహాగానాలు మొదలయ్యాయి. అలాగే ఆయన వైసీపీ  వీడి తెలుగు దేశంలో చేరుతున్నారనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఈ విషయం మీద మోహన్ బాబు ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చారు. శ్రీ విద్యానికేతన్ సమీపంలో నిర్మించిన సాయిబాబా గుడి విగ్రహ ప్రతిష్టాపన ఆగస్టులో జరగబోతుందని ఈ కార్యక్రమానికి చంద్రబాబును ఆహ్వానించేందుకు మాత్రమే కలిశానని మా భేటీ వెనుక ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని మోహన్ బాబు మీడియాకు ఒక ప్రకటన జారీ చేశారు. చాలా కాలం నుంచి సాయి బాబాకి భక్తుడిగా ఉన్న మోహన్ బాబు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద సాయిబాబా ఆలయాన్ని నిర్మించాలని భావించారు.


ఈ నేపథ్యంలో తాను కొంత డబ్బులు పెట్టడమే కాక ఆన్లైన్ ద్వారా స్వచ్ఛందంగా భక్తుల నుంచి విరాళాలు కూడా స్వీకరించారు. సాయిబాబా భక్తులు కానీ దాతలు కానీ ఎవరైనా విరాళాలు అందించాలంటే ఆన్లైన్ ద్వారా అందించవచ్చు అంటూ ఇటీవల మోహన్ బాబు మరో ప్రకటనలో తెలిపారు. ఇక ఈ సాయిబాబా ఆలయం నిర్మాణ ప్రతిష్టాపన మహోత్సవానికి చంద్రబాబుని ఆహ్వానించడానికి ఆయన నివాసానికి వెళ్ళినట్టు తెలుస్తోంది. ఇక ఈ మేరకు కొంత మందికి మోహన్ బాబు లేఖలు రాసిన అంశం కూడా హాట్ టాపిక్ గా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కూడా ఆయన లేఖ రాశారు. ఆ లేఖలో తాను 40 సంవత్సరాలుగా షిరిడి సాయినాధుని ఆరాధిస్తున్న సంగతి మీ అందరికీ తెలుసని ఇన్నాళ్లకు ఆయనకు నా మీద అనుగ్రహం కలిగి శ్రీ విద్యానికేతన్ పాఠశాల అలాగే మోహన్ బాబు విశ్వవిద్యాలయం పక్కన ఆయన గుడిగట్టే అదృష్టాన్ని మాకు అందించాడని పేర్కొన్నారు.[[{"fid":"239263","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ఈ బృహత్ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం 2022 ఆగస్టు నెల 9, 10,11వ తారీకుల్లో యాగాలు 11వ తారీఖున బాబా ప్రతిష్టాపన జరపబోతున్నామని పేర్కొన్నారు. మీరు నాకు ఆత్మీయులు, ఆప్తులు, మిత్రులు, సన్నిహితులు, నా శ్రేయోభిలాషులు కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి, పవిత్రమైనటువంటి కార్యక్రమంలో మీరు కూడా పాల్గొని బాబా ఆశీస్సులు అందుకోవాలని మా కోరిక అని లేఖలో పేర్కొన్నారు. నన్ను నా కుటుంబాన్ని దీవించండి నమస్కారం అంటూ డాక్టర్ మోహన్ బాబు లేఖ రాసిన అంశం హాట్ టాపిక్ గా మారింది. కేవలం ఈ ప్రతిష్టాపన మహోత్సవానికి ఆహ్వానించడం కోసమే తాను అక్కడికి వెళ్లానని మోహన్ బాబు క్లారిటీ ఇచ్చినట్లు అయింది.. రాజకీయ విభేదాలు పక్కన పెడితే ఇద్దరూ ఒకే జిల్లా వారు కావడంతో చంద్రబాబు, మోహన్ బాబు మధ్య సాన్నిహిత్యం ఉండేది. తర్వాత రాజకీయ కారణాలతో ఆ సాన్నిహిత్యం దూరమైంది.
Also Read: Producers Guild: ఆగష్టు 1 నుంచి షూటింగ్స్ బంద్.. మళ్లీ ఎప్పటి నుంచి అంటే!
Also Read: Ranveer singh Viral Video: పాపం బట్టల్లేవు.. దానం చేయండయ్యా!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.