Editor Mohan on Godfather : మెగాస్టార్ చిరంజీవి స్టామినా ఏంటో అందరికీ మరోసారి తెలిసి వచ్చింది. ఆచార్య డిజాస్టర్ టాక్ రావడంతో చిరంజీవి మార్కెట్ మీద అందరికీ అనుమానాలు మొదలయ్యాయి. అయితే గాడ్ ఫాదర్ సినిమా మీద ముందు నుంచి కూడా నెగెటివ్ ఇమేజ్ ఉంది. కానీ సినిమా విడుదలయ్యాక పాజిటివ్ మౌత్ టాక్ వచ్చింది. దీంతో లాంగ్ వీకెండ్ కలిసి రావడంతో సినిమాకు మంచి కలెక్షన్లు వస్తున్నాయి. మొదటి వీకెండ్‌లోనే ఈ సినిమా వంద కోట్ల క్లబ్బులో జాయిన్ అయ్యేట్టు కనిపిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లూసిఫర్ సినిమాకు గాడ్ ఫాదర్ చిత్రానికి పోలికలు వస్తున్నాకూడా.. కలెక్షన్లపై మాత్రం ప్రభావం కనిపించడం లేదు. తాజాగా మోహన్ రాజా తండ్రి ఎడిటర్ మోహన్.. గాడ్  ఫాదర్ సినిమాను వీక్షించించాడట. గాడ్ ఫాదర్ వీక్షించిన అనంతరం ఆయన మాట్లాడుతూ..  ‘లూసిఫర్‌’ కంటే ‘గాడ్‌ఫాదర్‌’ చాలా బాగుందని అన్నాడు.  


గాడ్‌ఫాదర్‌ పాత్రే కింగ్‌లా ఉంటుందని, చిత్రబృందం మొత్తం దీన్ని అద్భుతంగా తెరకెక్కించిందని కొనియాడాడు. ‘లూసిఫర్‌’ మహిళలకు నచ్చుతుందో లేదోననే ప్రశ్న ఉదయిస్తుందట. కానీ, ‘గాడ్‌ఫాదర్‌’ మహిళలకు తప్పకుండా నచ్చుతుందని ఎంతో ధీమాగా చెప్పుకొచ్చాడు. ఫ్యామిలీ ఆడియన్స్‌ దీన్ని చూసేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారని తెలిపాడు. 


తాను పనిచేసిన ఏ చిత్రమైనా విడుదలైతే.. థియేటర్‌కు వెళ్లి ఏదో ఒక మూల నిల్చొని ప్రేక్షకుల స్పందన ఎలా ఉందో చూసేవాడినంటూ చెప్పుకొచ్చాడు. కానీ, ఈ సినిమాని ప్రేక్షకులందరితో కలిసి థియేటర్‌లో కూర్చొని చూశానని తెలిపాడు. సినిమా జరిగినంతసేపు ప్రేక్షకులెవరూ పక్కన వారితో కూడా మాట్లాడలేదని అన్నాడు.


 సినిమాలో అంతలా లీనమైపోయారని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు.  సినిమాకి వస్తోన్న రెస్పాన్స్‌, బాక్సాఫీస్‌ కలెక్షన్స్‌ చూస్తుంటే.. చిరంజీవి ఎప్పటికీ బాక్సాఫీస్‌ ఘరానామొగుడే అని కీర్తించాడు. ఆయన ఎప్పటికీ కింగే అని ప్రశంసలు కురిపించాడు. ఇక అనంతరం తన చిన్నకుమారుడు ‘జయం’ రవిని తెలుగులోకి పరిచయం చేయనందుకు బాధగా ఉందని చెప్పుకొచ్చాడు.


Also Read : Gunasekhar Daughter : గుణ శేఖర్ కూతురి ఎంగేజ్మెంట్


Also Read : Adipursh Court Case: ఆదిపురుష్ కు మరో షాక్.. స్టే విధించాలంటూ హైకోర్టులో పిటిషన్!


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook