Akkineni Nagarjuna Sister: హీరో నాగార్జున సోదరిపై కేసు నమోదు.. సుశాంత్ సినిమాలే కారణమా..?
Case On Akkineni Nagarjuna Sister Naga Susheela: భూమికి సంబంధించిన వ్యవహారంలో అక్కినేని నాగార్జున సోదరి నాగ సుశీలపై మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో వ్యాపారి భాగస్వామిగా ఉన్న వ్యక్తి.. తనపై దాడికి పాల్పడ్డారంటూ కంప్లైంట్ ఇచ్చాడు.
Case On Akkineni Nagarjuna Sister Naga Susheela: టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున సోదరిపై కేసు నమోదైంది. ల్యాండ్ వ్యవహారంలో ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాగ సుశీలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమెపై 447, 427, 504, 506 సెక్షన్ల కింద మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. చింతలపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి తనపై నాగ సుశీలతో పాటు 12 మంది కలిసి తనపై దాడి చేశారని ఫిర్యాదు చేశాడు. వివరాలు ఇలా.. నాగ సుశీల, చింతలపూడి శ్రీనివాస్ చాలా ఏళ్లుగా వ్యాపార భాగస్వాములుగా కొనసాగుతున్నారు. వీరిద్దరు కలిసి పలు సినిమాలు నిర్మించడంతోపాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు.
శ్రీ నాగ్ ప్రొడక్షన్‌పై సుశాంత్ హీరోగా మూడు సినిమాలు తీశారు. ఇందులో కరెంట్ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకోగా.. అడ్డా, ఆటాడుకుందాం సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి. దీంతో బాగా నష్టాలు వచ్చాయి. అప్పటికే ఇద్దరి మధ్య భూమి విషయంలో మనస్పర్థలు ఉన్నాయి. ఆటాడుకుందాం చిత్రం ఫ్లాప్ తరువాత విభేదాలు ఎక్కువ అయ్యాయి. ఈ మూవీ కోసం శ్రీనివాస్ రూ.5 కోట్లు సమకూర్చినట్లు సమాచారం. అయితే సినిమా ఫ్లాప్ కావడంతో ఇద్దరి మధ్య దూరం పెరిగినట్లు తెలుస్తోంది.
గతంలో ఇద్దరు చింతలపూడి శ్రీనివాస్, నాగ సుశీల పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. తమకు తెలియకుండా.. తమ భూమిని అమ్మేశారని ఆరోపిస్తూ శ్రీనివాస్‌పై నాగ సుశీల పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన ల్యాండ్‌ను విక్రయించి.. డబ్బులను దుర్వినియోగం చేశారని కంప్లైంట్‌లో పేర్కొన్నారు. తాజాగా తనపై నాగ సుశీల దాడికి పాల్పడ్డారంటూ శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Also Read: World Cup 2023: ప్రపంచకప్‌కు ముందు వన్డేల్లో నెం.1గా నిలిచేదెవరు..? లెక్కలు ఇలా..!
Also Read: Bigg Boss-7 Telugu: రెండో వారం ఎలాంటి ట్విస్టుల్లేవ్.. హౌస్ నుంచి ఆమె ఔట్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook