Jai Hanuman Update: 2024లో.. రెండు సినిమాలు అంచనాలకు మించి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు.. సాధించాయి. మొదటిది కల్కి 2898 ఏడి సినిమా. ఎంత స్టార్ హీరో.. సినిమా అయినప్పటికీ మొదటి వారమే.. సినిమాకి సంబంధించిన హడావిడి కనిపిస్తుంది. కానీ కల్కి సినిమా విషయంలో.. మాత్రం విడుదల ఎన్ని రోజులు గడుస్తున్నా కలెక్షన్లు మాత్రం కొంచెం కూడా తగ్గుముఖం పట్టడం లేదు. కాగా కల్కి కంటే ముందు మరొక సినిమా కూడా తక్కువ అంచనాలతో విడుదలై భారీ కలక్షన్లు అందుకుంది. అదే హనుమ్యాన్ సినిమా. తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ.. దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్.. వద్ద సంచలనం సృష్టించింది. ఈ సినిమా క్లైమాక్స్ కూడా పార్ట్ 2 ఉంటుంది.. అని ఎండ్ అవుతుంది. దీంతో ఈ సినిమాకి సీక్వెల్ గా.. వస్తున్న జై హనుమాన్ సినిమా కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమా సక్సెస్ తో ప్రశాంత్ వర్మ.. బాలీవుడ్ లో.. రన్వీర్ సింగ్ హీరోగా.. ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ అది కాస్త క్యాన్సిల్ అయింది. ఈ సినిమా హడావిడిలో.. పడి కొంచెం సమయం కూడా వృధా అయిపోయింది. ఇక ప్రస్తుతానికి జై హనుమాన్.. స్క్రిప్ట్ వర్క్ కొంత భాగం ప్రశాంత్ వర్మ పూర్తి చేసినట్టు వినికిడి. కానీ అది పూర్తిగా ఒక కొలిక్కి.. రావడానికి కనీసం సంవత్సరం అయినా సమయం పడుతుంది. 


అయితే ఈ సినిమా నిర్మాతల్లో ఒకరు అయిన చైతన్య రెడ్డి.. సీక్వెల్లో హనుమంతుడి పాత్రలో రామ్ చరణ్ లేదా చిరంజీవి అయితే బాగుంటుంది అని కామెంట్లు చేశారు. అవి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా నిజంగానే ఈ ఇద్దరు హీరోలలో.. ఒకరు ఆ పాత్రలో కనిపిస్తారు అని మెగా అభిమానులు ఫిక్స్ అయిపోయారు. ఎలాగో అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి.. ఇంకొంచెం రీచ్ కాస్టింగ్ పెరగడం కోసం.. ప్రశాంత్ వర్మ ప్రధాన పాత్రల్లో స్టార్ కాస్ట్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. 


మళ్లీ వాళ్లందరి డేట్లు.. తీసుకొని సినిమాని పూర్తి చేయడానికి ఇంకా సమయం పట్టవచ్చు. అందులో నిజా నిజాలు ఎలా ఉన్నా.. సినిమా పూర్తి అవడానికి రెండేళ్లకు పైగానే సమయంపడుతుంది అని  మాత్రం క్లారిటీ వచ్చేసింది. 


ఇక మరోవైపు నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ అని కూడా ప్రశాంత్ వర్మ లాంచ్ చేయనున్నారు. ఎప్పటినుంచో నందమూరి అభిమానులు ఎదురుచూస్తున్న మోక్షజ్ఞ డెబ్యూ సినిమా కాబట్టి దీని మీద కూడా బాగానే అంచనాలు ఉన్నాయి. మరి ఇన్ని అంచనాల మధ్య రెండు సినిమాలు.. ప్రశాంత్ వర్మ ఎప్పటికీ పూర్తి చేస్తారో వేచి చూడాలి. అయితే ఈ రెండు సినిమాలలో ఏ ఒక సినిమా కొంచెం అటూ ఇటూ అయినా.. ప్రశాంత్ వర్మ కథ కంచికే అంటున్నారు సినీ విశ్లేషకులు. కాబట్టి ప్రశాంత్ వర్మ తప్పకుండా ఈ రెండు సినిమాల పైన అత్యంత శ్రద్ధ పెట్టి తీరాల్సిందే. మొత్తానికి.. ప్రస్తుత పరిస్థితులను బట్టి..ఇంకో నాలుగు సంవత్సరాల పాటు ఈ దర్శకుడు శ్రమించక తప్పదు.


Also Read: కాంగ్రెస్ లో నరాలు తేగే ఉత్కంఠ.. రేపే మంత్రి వర్గ విస్తరణ..?.. ఆషాడం ఎఫెక్ట్..


Also Read:​ డిప్యూటీ సీఎం పేరు చెప్పి రైతు సూసైడ్.. భట్టీకి చెక్ పెట్టేదిశగా పావులంటూ జోరుగా చర్చలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి