Most Eligible Bachelor: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్..ఇప్పుడు టాలీవుడ్‌లో ఈ సినిమాపైనే చర్చ సాగుతోంది. లాక్‌డౌన్ కారణంగా ఆలస్యమైన సినిమా విడుదలపై ఉత్కంఠ రేగుతోంది. ఇంతకీ ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందంటే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


అక్కినేని అఖిల్ ( Akkineni akhil ) - పూజా హెగ్డే ( Pooja hegde ) జంటగా రూపుదిద్దుకుంటున్న మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. లాక్‌డౌన్ కారణంగా విడుదల ఆలస్యమైన ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు.  అఖిల్- పూజా హెగ్డే కాంబినేషన్‌లో చిత్రం కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. 


సంక్రాంతి ( Sankranti ) శుభాకాంక్షలు అందిస్తూ ఇప్పటికే ప్రత్యేక పోస్టర్ విడుదలైంది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌ది ( Most Eligible Bachelor ). దాంతో ఇంకాస్త హైప్ క్రియేట్ అయింది. విడుదల ఎప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు సినిమా నిర్మాతలు క్లారిటీ ఇచ్చేశారు. వేసవి సెలవుల్లో సినిమా విడుదల చేసేందుకు రంగం సిద్ధమౌతోంది. 


ఈ కొన్ని దృశ్యాల్ని రీషూట్ చేస్తున్నారిప్పుడు. గీతా ఆర్ట్స్ - 2  ( Geetha arts -2 Banner ) బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు వాసువర్మ కో ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై అక్కినేని అఖిల్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. 


Also read: Red Pre Release Event: ఆ తప్పిదంపై స్పందించిన హీరో రామ్ పోతినేని


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook