Actress Meena: ఇకనైనా అసత్య ప్రచారం ఆపండి..భర్త మరణంపై నటి మీనా భావోద్వేగ లేఖ..!
Actress Meena: భర్త మరణంపై తొలిసారి సినీ నటి మీనా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఓ లేఖను విడుదల చేశారు.
Actress Meena: తన భర్త మరణంపై అసత్యాలు ఆపాలంటూ నటి మీనా భావోద్వేగ లేఖను విడుదల చేశారు. విద్యా సాగర్ మరణంపై మీడియాలో వస్తున్న అసత్య కథనాలను ఆపాలని సోషల్ మీడియా వేదికగా కోరారు. తన భర్త దూరమయ్యారనే బాధలో తానున్నానని..ఈ పరిస్థితుల్లో తమ కుటుంబ ప్రైవసీని భంగం కల్గించకండని తెలిపారు. పరిస్థితి అర్థం చేసుకోవాలని వేడుకున్నారు. తన భర్త ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించిన వైద్యులు, తమిళనాడు సీఎం, మంత్రులు, స్నేహితులకు కృతజ్ఞతలు చెప్పారు.
[[{"fid":"236540","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
తన భర్త కోలుకోవాలని ప్రార్థనలు చేసిన అభిమానులకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశారు. ఇప్పటికైనా తన భర్త మరణంపై ఎలాంటి అసత్య ప్రచారాలు చెయొద్దన్నారు. గత కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న మీనా భర్త విద్యాసాగర్ ఇటీవల మృతి చెందారు. చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. భర్తను కాపాడుకునేందుకు మీనా ఎంతో శ్రమించారు. ఈవిషయాన్ని పలువురు సినీ ప్రముఖులు వెల్లడించారు.
Also read: KTR Letter to PM Modi: మీ డీఎన్‌ఏలోనే విద్వేషం ఉంది..ఆవో దేఖో సీకో అంటూ మోదీకి కేటీఆర్ లేఖాస్త్రం..!
Also read:TRS vs BJP: హైదరాబాద్‌లో పోటా పోటీ ఫ్లెక్సీలు..బీజేపీకి కౌంటర్‌గా భారీ హోర్డింగ్‌లు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook