TRS vs BJP: హైదరాబాద్‌లో పోటా పోటీ ఫ్లెక్సీలు..బీజేపీకి కౌంటర్‌గా భారీ హోర్డింగ్‌లు..!

TRS vs BJP: హైదరాబాద్‌లో రేపు, ఎల్లుండి బీజేపీ కార్గవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఇందుకు ఏర్పాట్లన్నీ పూర్తైయ్యాయి. రాష్ట్రానికి బీజేపీ అగ్ర నేతలు చేరుకుంటున్నారు.ఈక్రమంలో హోర్డింగ్‌ల ఏర్పాటు హాట్ టాపిక్‌గా మారింది.

Written by - Alla Swamy | Last Updated : Jul 1, 2022, 06:56 PM IST
  • తెలంగాణలో పొలిటికల్ హీట్
  • రేపు, ఎల్లుండి బీజేపీ కార్యవర్గ సమావేశాలు
  • పోటా పోటీ ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు
TRS vs BJP: హైదరాబాద్‌లో పోటా పోటీ ఫ్లెక్సీలు..బీజేపీకి కౌంటర్‌గా భారీ హోర్డింగ్‌లు..!

TRS vs BJP: హైదరాబాద్‌లో రేపు, ఎల్లుండి బీజేపీ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఇందుకు ఏర్పాట్లన్నీ పూర్తైయ్యాయి. రాష్ట్రానికి బీజేపీ అగ్ర నేతలు చేరుకుంటున్నారు. ఈక్రమంలో హైదరాబాద్‌లో టీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీ ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లను ఏర్పాటు చేశాయి. బీజేపీ నేతల కంటే ముందే టీఆర్ఎస్ నేతలు నగరమంతా గులాబీమయం చేశారు. తామేమి తక్కువ కాదంటూ తమదైన శైలిలో బీజేపీ నేతలు కటౌట్లు పెట్టారు.

తాజాగా మరికొన్ని హోర్డింగ్‌ల ఏర్పాటు చర్చనీయాంశంగా మారింది. నగర ప్రధాన రోడ్లపై వెల్కం టు తెలంగాణ అంటూ భారీ హోర్డింగ్‌లు వెలిశాయి. ఇవి స్వాగతం చెప్పినట్లు కనిపిస్తున్నా వ్యంగ్యంగా..ఇతర రాష్ట్రాల నేతలకు సెటేరిక్‌గా ఏర్పాటు చేశారు. 8 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో ఎలా అభివృద్ధి జరిగింది..వివిధ రంగాల్లో పురోగతి ఎలా ఉందో హోర్డింగులు వివరిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే నేతలకు అర్థమయ్యేలా వీటిని రూపొందించారు.

ఇటు నగరంలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. రాష్ట్ర ప్రజలను ఆలోచింపజేసేవిగా ఉన్నాయి. బీజేపీ నేతలకు కౌంటర్‌గా వీటిని ఏర్పాటు చేసినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం బీజేపీ అగ్రనేతల రాకపై హడావిడి కొనసాగుతోంది. ఈక్రమంలో అందుకు ధీటుగా వీటిని ఏర్పాటు చేశారు. జాతీయ నాయకత్వమే టార్గెట్‌గా వీటిని ఏర్పాటు చేశారు. 

Also read: Nupur Sharma: నుపుర్ శర్మ అభ్యర్థనకు నో..క్షమాపణ చెప్పాల్సిందేనని సుప్రీం కోర్టు స్పష్టీకరణ..!

Also read:KTR Letter to PM Modi: మీ డీఎన్‌ఏలోనే విద్వేషం ఉంది..ఆవో దేఖో సీకో అంటూ మోదీకి కేటీఆర్ లేఖాస్త్రం..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News