Mr Bachchan Pre Release Business:  రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’, బిగ్ బీ  అమితాబ్ బ్రాండ్ ను ఉపయోగిస్తూ హరీష్ శంకర్ ఈ సినిమాను  తెరకెక్కించారు. డైరెక్టర్  హరీష్ శంకర్ పై ‘షోలే’ సినిమా పెద్ద ఇంపాక్ట్ చూపించినట్టు కనిపిస్తోంది.అందుకే ఆ సినిమాలోని విలన్ పేరైనా ‘గబ్బర్ సింగ్’ టైటిల్ ను  పవన్ కళ్యాణ్ సినిమాకు తెరకెక్కించారు. అటు రవితేజ సినిమాకు ఏకంగా ‘మిస్టర్ బచ్చన్’ పేరు పెట్టారు.ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా హిందీలో అజయ్ దేవ్ గణ్ హీరోగా తెరకెక్కిన ‘రెయిడ్’ మూవీకి రీమేక్. కానీ తెలుగులో ఈ సినిమాను హరీష్ శంకర్ పూర్తిగా కమర్షియల్ హంగులతో తెరకెక్కించినట్టు చెప్పారు. ఈ సినిమాను 1980లో ప్రముఖ ఇన్ కంటాక్స్ ఆఫీసర్ సర్ధార్ ఇందర్ సింగ్ జీవితం నేపథ్యంలో రాజ్ కుమార్ గుప్తా తెరకెక్కించారు. అజయ్ దేవ్ గణ్ హీరోగా నటించారు. 2018లో విడుదలైన ‘రెయిడ్’ చిత్రం మంచి సక్సెస్ అందుకుంది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతేకాదు ‘మిస్టర్ బచ్చన్’ సినిమాలో ‘షోలే’ సినిమాల నాటి జ్ఞాపకాలు చూపించబోతున్నాడు దర్శకుడు. అంతేకాదు ఆనాటి వింటేజ్ లుక్ కోసం హరీష్ శంకర్ పడ్డ కష్టం తెరపై కనిపించింది.  రవితేజకు వరుస ఫ్లాపులున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరిగింది.


ఈ సినిమా తెలంగాణ (నైజాం).. రూ. 11.50 కోట్లు..
సీడెడ్ (రాయలసీమ) -- రూ. 4 కోట్లు
మిగిలిన ఆంధ్ర ప్రదేశ్ .. రూ. 11.50 కోట్లు
ఆంధ్ర ప్రదేశ్ + తెలంగాణ కలిపి రూ. 28 కోట్లు
కర్ణాటక + రెస్ట్ ఆఫ్ భారత్ .. రూ. 2 కోట్లు
ఓవర్సీస్.. రూ. 2 కోట్లు..
మొత్తంగా ‘మిస్టర్ బచ్చన్’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 31 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా హిట్ అందుకోవాలంటే దాదాపు రూ. 32 కోట్లు రాబట్టాలి.


స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా విడుదల కాబోతున్న ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ కంపల్‌సరీ. ఈ సినిమాకు పోటీగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటించిన ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా రిలీజ్ కాబోతుంది. మరీ గట్టి పోటీలో ఈ సినిమా ఏ మేరకు కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.


మిస్టర్ బచ్చన్ సినిమా స్టోరీ విషయానికొస్తే.. ఒక నిజాయితీ గల ఇంకమ్ టాక్స్ ఆఫీసర్.. ఓ రాజకీయ నాయకుడిపై రెయిడ్ చేయడం వలన జరిగిన సంఘటనల సమాహారం. ఈ నేపథ్యంలో ఓ పొలిటిషన్ కు చెందిన గూండాలు, అనుచరులు.. ఇంకమ్ టాక్స్ అధికారులపై ఎటాక్ చేస్తారు. దాన్నుంచి ఆదాయ పన్ను అధికారులు ఎలా  తప్పించుకున్నారనేది ఈ సినిమా. ఈ సినిమాలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే నటించింది. క్యూట్ లుక్స్ తో అట్రాక్ట్ చేస్తోంది. ఈ సినిమా హిట్టైనా.. కాకపోయినా.. హీరోయిన్ గా భాగ్యశ్రీకు వరుస అవకాశాలు రావడం ఖాయం అనే చెప్పాలి.


Also Read: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..


Also Read: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter