Mani Shankar Audio Launch Event మురళీ మోహన్ రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టడం, అక్కడ గణనీయమైన లాభాలు గడించడం గురించి ఎన్నో సార్లు చెబుతూనే వచ్చాడు. అయితే తాజాగా మరోసారి రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్ గురించి చెప్పుకొచ్చాడు. శివ కంఠమనేని హీరోగా రాబోతోన్న మణిశంకర్ సినిమాలో సంజనా గల్రానీ హీరోయిన్‌గా నటించింది. లైట్ హౌస్ సినీ క్రియేషన్స్ ప‌తాకంపై కె.ఎస్. శంకర్ రావు, ఆచార్య శ్రీ‌నివాస‌రావు, ఎం. ఫణిభూషణ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం జి.వి.కె(జి. వెంక‌ట్‌ కృష్ట‌ణ్‌) వహించారు. నేడు ఈ మూవీ ఆడియో ఈవెంట్‌ను నిర్వహించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఈవెంట్‌లో మురళీ మోహన్ మాట్లాడుతూ మణిశంకర్ సినిమా నిర్మాతల గురించి చెప్పుకొచాడు. మేం అంతా కూడా రియల్ ఎస్టేట్‌లో భాగస్వామ్యులమని చెప్పుకొచ్చాడు. శంకర్ తీసిన మణిశంకర్ సినిమా విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నానని అన్నాడు. ఇలా రియల్ ఎస్టేట్ రంగం నుంచి ఇండస్ట్రీలోకి వీరంతా రావడం ఆనందంగా ఉందని అన్నాడు. ట్రైలర్ చూస్తే సినిమా మీద ఆసక్తికలిగేలా ఉందని చెప్పుకొచ్చాడు.


అనంతరం సీ కళ్యాణ్ మాట్లాడుతూ.. తండ్రి ఇష్టాలకు అనుగుణంగా సినిమాలు తీస్తున్న శంకర్‌ కొడుక్కి థాంక్స్ తెలిపాడు. ఇంకా ఇంకా సినిమాలు తీస్తూ.. ప్రతీ నెలా ఓ రెండొందల మందికి భోజనం పెట్టాలని కోరాడు. వీఐపీ ప్రైమ్‌ సీఈవో సతీష్‌ రెడ్డి మాట్లాడుతూ.. మణిశంకర్ సినిమాను అద్భుతంగా తీశారనీ, స్ట్రీమింగ్‌కి కాకుండా.. నేరుగా అవుట్ రైట్స్ అడిగామంటే సినిమాలో ఎంత డెప్త్ ఉందో ఊహించుకోండని అన్నాడు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్టుగా చెప్పుకొచ్చాడు.


Also Read : Geetha Madhuri Husband : గుర్తు పట్టలేనంతగా మారిన గీతూ మాధురి భర్త.. లుక్ బాలేదంటూ కష్టాన్ని గుర్తించని నెటిజన్లు


Also Read : Rashmika Mandanna Dating : రష్మిక ప్రస్తుత దుస్థితికి కారణం విజయ్ దేవరకొండనా?.. వేణు స్వామి కామెంట్స్ వైరల్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook