Music Director Raj in Raj Koti Duo Passed Away: టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సంగీత దర్శకుల్లో ఒకరైన రాజ్ కన్నుమూశారు. ఆయన అసలు పేరు తోటకూర సోమరాజు. రాజ్ గా ఆయన సుపరిచితులు. గత కొంతకాలంగా వయోభారం వల్ల ఇంటికే పరిమితమైన ఆయన ఆదివారం నాడు వాష్ రూమ్ కి వెళ్లి అక్కడ కాలుజారి పడిపోవడంతో గుండెపోటుకి గురయ్యారు పెద్ద శబ్దం రావడంతో కుటుంబ సభ్యులు ఆయన హుటాహుటిన హాస్పిటల్ కి తరలించారు కానీ అప్పటికే ఆయన గుండెపోటు వల్ల మరణించినట్లుగా వైద్యులు ప్రకటించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆయన హైదరాబాద్లోని కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ లో తన భార్య కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు కాగా పెద్ద కుమార్తె దీప్తి , రెండో కుమార్తె దివ్య మూడో కుమార్తె శ్వేత. వీరిలో దివ్య సినీ పరిశ్రమలోనే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అసోసియేట్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు మూడో కుమార్తె శ్వేత మలేషియాలో నివాసం ఉండడంతో ఆమె తండ్రి మరణవార్త విని హుటాహుటిన బయలుదేరారు. శ్వేత వచ్చిన తర్వాత ఆయన అంత్యక్రియలు హైదరాబాద్ లోని మహాప్రస్థానంలో సోమవారం ఉదయం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజు వయసు ప్రస్తుతం 68 సంవత్సరాలు. ఆయన అలనాటి సంగీత దర్శకుడు టీవీ రాజు కుమారుడు. ఒకరకంగా టాలీవుడ్ లో ప్రముఖ సంగీత దర్శకుల్లో రాజ్ కోటి ద్వయం ఒకటి. 


Also Read:  Kavya Thapar Photos: జంగిల్ సఫారీ చేస్తూ జంగ్లీ ఫోజులు ఇచ్చిన కావ్య థాపర్... హీటు తట్టుకోగలమా?


తొంభైల్లో వచ్చిన సినిమాల్లో రాజ్ కోటి కాంబో సినిమాలకు మంచి డిమాండ్ ఉండేదని అనడంలో ఎలాంటి సందేహం లేదు.  ప్రళయ గర్జన అనే సినిమాతో రాజ్ కోటి ప్రయాణం మొదలవగా ఆ మొదటి సినిమాతోనే వాళ్లిద్దరూ సంగీత దర్శకులుగా మంచి మార్కులు వేయించుకున్నారు. యముడికి మొగుడు సినిమాకు మ్యూజిక్ అందించడంతో రాజ్ కోటికి ఆ సినిమాతో బ్రేక్ దొరికింది. అప్పటి నుంచి. వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమా అంటే పక్కాగా మ్యూజికల్ హిట్ అనే టాక్ ఉండడంతో దర్శక నిర్మాతలు రాజ్ కోటి సంగీతం కోసం క్యూలు కట్టేవారు.


ఏమయిందో ఏమో తెలియదు కానీ కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు వారి భేదాభిప్రాయాలు తలెత్తాయి. తర్వాత విడిపోయి ఎవరికి వారు విడివిడిగా సినిమాలు చేయడం ప్రారంభించారు. ఇక రాజ్ కోటి విడిపోయిన తర్వాత రాజ్ ఎక్కువగా సినిమాలు చేయలేదు కానీ కోటి మాత్రం టాప్ కి వెళ్లారు. ఇక విడిపోయాక రాజ్ చేసిన సినిమాల్లో ‘సిసింద్రీ’ ఒక్కటే చెప్పుకోదగినది. చివరిగా ఆయన లగ్నపత్రిక సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ఆ తరువాత రాజ్ -కోటి మధ్య మాటలు మొదలైనా ఎందుకో కలిసి కంపోజింగ్ మాత్రం చేయలేదు. 

Also Read: NTR Fans Over Action : థియేటర్లో మంటలు.. సింహాద్రి షో క్యాన్సిల్.. వెర్రితనమంటే ఇదే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook