Yashoda Movie First Review : లోలోతుల్లో తడిమేశావ్!.. సమంత యశోద రివ్యూ చెప్పిన తమన్
Samantha Yashoda First Review సమంత నటించి యశోద మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సమంత యశోద మూవీని చూశాడట. ఈ మేరకు సమంత అదరగొట్టేసిందని పేర్కొన్నాడు.
Yashoda Movie First Review : సమంత తన స్క్రిప్ట్ విషయంలో ఎంతో మారిపోయింది. తనకంటూ ప్రత్యేక పాత్రలు ఉంటేనో.. లేదంటే కథ, కథనాలు కొత్తగా ఉంటేనో సినిమాలు చేస్తోంది. లేడీ సెంట్రిక్ మూవీలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తోంది. కొత్త పాయింట్‌తో వచ్చే వారికి చాన్సులు ఇస్తోంది. సమంత మీద ఇప్పుడు నేషనల్ మీడియా చూపు కూడా ఉంది. పుష్ఫలోని ఊ అంటావా పాటతో ఒక్కసారిగా ట్రెండ్ అయింది. అంతకు ముందు ఫ్యామిలీ మెన్ సీజన్ 2లో రాజీ పాత్రతో అందరినీ మెప్పించింది.
ఇక ఇప్పుడు సమంత యశోద అంటూ పాన్ ఇండియన్ లెవెల్లో రాబోతోంది. అయితే ఈ యశోద సినిమాలో తీసుకున్న పాయింట్ కూడా కొత్తదే. అసలే ఇప్పుడు సరోగసి వివాదం మరింతగా మారింది. నయనతార సరోగసి ద్వారా పిల్లల్ని కన్న సంగతి బయటకు వచ్చిన తరువాత జరిగిన చర్చ అందరికీ తెలిసిందే. అయితే ఈ సరోగసి చుట్టూ అల్లుకున్న కథతో యశోద సినిమా రాబోతోంది. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ అంచనాలు పెంచేసింది. ఇందులో సమంత యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా అదిరిపోయాయి.
సమంత నటన, ఫైట్స్ ఇలా అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇలా అన్నీ కూడా అదిరిపోయాయి. ఈ చిత్రం నవంబర్ 11న రాబోతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ లోపే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సినిమాను వీక్షించేశాడట. ఈ మేరకు తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. సినిమాను చూసి ఫస్ట్ రివ్యూ కూడా ఇచ్చేశాడు.
డియర్ సామ్.. ది మోస్ట్ బ్రిల్లియంట్ అండ్ స్రాంగెస్ట్.. ఇప్పుడే యశోద సినిమాను చూశాను.. ఇది నిజంగా ఎంతో హార్డ్ హిట్టింగ్.. లోలోతుల్లో టచ్ చేసింది.. సినిమా అందరికీ సూపర్ సక్సెస్ రావాలి.. మణిశర్మ గారు అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు.. నవంబర్ 11న ఈ సినిమాను మిస్ అవ్వకండి అని ట్వీట్ వేశాడు.
Also Read : Bigg Boss Sreemukhi Photoshoot : ప్యాంట్ మరిచిన బిగ్ బాస్ బ్యూటీ.. ఫోటోలతో హీట్ పెంచేస్తోన్న శ్రీముఖి
Also Read : Hamida Khatoon New Benz Car : కొత్త కారు కొన్న హమీద.. దాని రేటు ఎంతంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook