Martin: మైత్రీ మూవీ మేకర్స్.. రీసెంట్ గా విజయ్ హీరోగా నటించిన ‘గోట్’ మూవీని తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేసింది. ‘హనుమాన్’ మూవీ నుంచి మైత్రీ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి దూసుకుపోతుంది. తాజాగా యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు ధృవ సర్జ హీరోగా నటిస్తున్న ‘మార్టిన్’ మూవీని తెలుగులో డిస్ట్రిబ్యూషన్ హక్కులను దక్కించుకుంది. ఎ.పి.అర్జున్ ద‌ర్శ‌క‌త్వంలో వాస‌వీ ఎంట‌ర్‌ప్రైజెస్‌, ఉద‌య్ కె.మెహ‌తా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్‌పై ఉద‌య్ కె.మెహ‌తా, సూర‌జ్ ఉద‌య్ మెహ‌తా ఈ భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ను భారీ ఖర్చుతో  నిర్మించారు. రీసెంట్‌గా విడుద‌లైన మూవీ ట్రైల‌ర్‌కు అన్ని భాషల్లో మంచి రెస్పాన్స్ వ‌చ్చిన సంగతి తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ అందరినీ అట్రాక్ట్ చేస్తుంది. ఈ ట్రైలర్ చూస్తుంటే భారతీయ సిల్వర్ స్క్రీన్ పై  ఇది వరకెన్నడూ చూడని యాక్షన్ అడ్వెంచర్ చిత్రంగా మార్టిన్ ఉంది. ఈ ట్రైలర్‌లో ధృవ్ సర్జా లుక్స్, యాక్షన్ సీక్వెన్స్, చివర్లో చెప్పిన డైలాగ్ అన్నీ కూడా గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఈ సినిమాకు మన దేశంలో యాక్షన్ కింగ్ గా పేరు తెచ్చుకున్న హీరో కమ్ నిర్మాత కమ్ ద‌ర్శ‌కుడు అయిన యాక్ష‌న్ కింగ్ అర్జున్ ఈ మూవీకి క‌థ‌ను అందించ‌టం విశేషం.


మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ ఈ సినిమాకు  సంగీతాన్ని అందించారు.  ర‌వి బ‌స్రూర్ బ్యాగ్రౌండ్ స్కోర్‌ను అందించారు. ఈ ట్రైలర్‌లో ఆర్ఆర్‌ను వింటే.. రవి బస్రూర్ ఈ చిత్రాన్ని మరో స్థాయిలో నిలబెట్టేలా ఉన్నాయి. ఈ సినిమా విజువల్స్ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ఉన్నాయి. అక్టోబర్ 11న దసరా  కానుకగా రజినీకాంత్ చిత్రం ‘వేటగాడు’ మూవీతో పోటీ పడుతూ ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల కాబోతుంది. ఈ చిత్రం మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్‌పి ద్వారా నైజాం (తెలంగాణ)లో రిలీజ్ కాబోతుంది. ఏపీ, సీడెడ్ (రాయలసీమ)‌లో ఎంఎస్ ఫిల్మ్స్ ద్వారా రిలీజ్ కానుంది.


ఇదీ చదవండి:  ఎన్టీఆర్ ఇంటిని చూశారా.. బృందావనాన్ని మించిన తారక్ ఇల్లు..!


ఇదీ చదవండి: మహాలయ పక్షంలో ఏ తిథి రోజు శ్రార్ధం పెడితే ఎలాంటి ఫలితాలుంటాయి.. !



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.