Mythri Movie Makers with Prithviraj Sukumaran: సినీ నిర్మాణం అనేది సవాళ్లతో కూడుకున్న విషయం. కానీ నిర్మాణంలోకి అడుగుపెట్టిన తర్వాత చేస్తున్న దాదాపు అన్ని సినిమాలతో హిట్స్ అందుకున్న ముందుకు దూసుకు వెళుతోంది మైత్రి మూవీ మేకర్స్ సంస్థ. సినీ నిర్మాణంలో పూర్వానుభవం లేకపోయినా కేవలం పాషన్తో, కథలను నమ్మి సినిమాల మీద పెట్టుబడి పెడుతూ వెళ్తున్న మైత్రి మూవీ మేకర్స్ మరో ఆసక్తి కరమైన ప్లాన్ తో ముందుకు వస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బడా హీరోలందరితో సినిమాలు చేసి చేయడానికి సిద్ధంగా ఉన్న మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఇప్పుడు ఇతర భాషలలో కూడా తమ ప్రాభవాన్ని చాటుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అసలు విషయం ఏమిటంటే మలయాళంలో సూపర్ స్టార్ అయిన పృథ్వీరాజ్ సుకుమారన్ తన సినిమా ప్రమోషన్ కోసం గత 2,3 రోజులుగా హైదరాబాద్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రశాంత్ నీల్ తో భేటీ అయ్యారు కూడా. అయితే టాలీవుడ్ వర్గాల్లో జరుగుతున్న మరో ప్రచారం మేరకు మైత్రి మూవీ మేకర్స్ సంస్థ కూడా పృథ్వీరాజ్ సుకుమారన్ తో భేటీ అయిందని, ఈ భేటీలో నేరుగా ఒక తెలుగు సినిమా చేసి ఇవ్వాలని వారు కోరారని తెలుస్తోంది. ఇప్పటికే పుష్ప, అంటే సుందరానికి వంటి సినిమాలతో మలయాళ మార్కెట్లోకి కూడా ఎంట్రీ ఇచ్చిన మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఇప్పుడు మలయాళ హీరోతో తెలుగు సినిమా డైరెక్ట్ చేయించడంతో ఒకపక్క తెలుగులో కలెక్షన్స్ రాబట్టడమే కాక పృథ్వీరాజ్ సుకుమారన్ క్రేజ్ తో మలయాళ మార్కెట్లో కూడా సుస్థిరం అవ్వాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 


పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఇటీవల తన సినిమా ప్రమోషన్ లో భాగంగా తాను త్వరలో దర్శకుడిగా తెలుగు సినిమా చేసే అవకాశం ఉందని ప్రకటించారు. ఆయన అలా ప్రకటించారో లేదో వెంటనే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అప్రోచ్ అయ్యారని, 30 కోట్ల రూపాయలకు ఫస్ట్ కాపీ ఇచ్చేలా డీల్ కుదుర్చుకున్నారని సమాచారం. 30 కోట్లతో ఎలా సినిమా చేసి తమకు ఇస్తారో తమకు అనవసరమని బడ్జెట్ మీరు ఎంతైనా వాడుకోండి కానీ మాకు మాత్రం ఫస్ట్ కాపీ 30 కోట్లలోపు ఇస్తే సరిపోతుందని ఒకవేళ బడ్జెట్ పెరిగితే అది మీరే భరించాలని డీల్ మాట్లాడినట్లు సమాచారం. 


సాధారణంగా చాలా తక్కువ ఖర్చుతోనే మలయాళ సినిమాలు చేసిన అనుభవం ఉన్న పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ ముప్పై కోట్ల రూపాయల డీల్ కు ఒప్పుకున్నారని తెలుగు, తమిళ, మలయాళ నటీనటులతో సినిమా ప్లాన్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ మూడు భాషలలో కచ్చితంగా విడుదల చేస్తూ కుదిరితే కన్నడ, హిందీ భాషల్లో కూడా విడుదల చేసేలా ఒక మంచి తక్కువ బడ్జెట్ సినిమా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. మొత్తం మీద మైత్రి మూవీ మేకర్స్ చూపిన చొరవ, వారి ప్లానింగ్ మాత్రం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.


Also Read: Alia Bhatt Pregnancy: త‌ల్లి కాబోతున్న అలియా భ‌ట్‌.. వైర‌ల్ అవుతున్న ఫోటో!


Also Read: Manasanamaha enters Guinness Book: తెలుగు షార్ట్ ఫిలిం 'మనసామహా'కు అరుదైన గౌరవం.. ప్రపంచబాషల్లోనే టాప్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.